వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ టాపర్‌గా జైలు ఖైదీ

|
Google Oneindia TeluguNews

లండన్‌: మనసుంటే మార్గముందనే సామెతను నిజం చేశాడో ఖైదీ. ఏదో నేరం చేసి జైలుకెళ్లిన వ్యక్తి.. తన తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే జైలులో ఉంటూనే కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలో పీజీ చదివాడు. కాగా, పీజీ పరీక్షల్లో ఈ ఖైదీ ప్రథమ స్థానం సాధించడం విశేషం.

వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌కు చెందిన గరెత్‌ అనే 28ఏళ్ల వ్యక్తికి ఐదేళ్ల కిందట ఓ కేసులో జైలు శిక్ష పడింది. అప్పటి నుంచి అతడు బకింగ్‌హమ్‌షైర్‌లోని గెండన్‌ జైలులో ఉంటున్నాడు.

 Inmate Tops Cambridge University Class From Prison

అయితే చదువుమీద ఆశతో గరెత్‌.. కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలో క్రిమినాలజీ విభాగంలో పీజీలో చేరాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో గరెత్‌ క్లాస్‌లోనే టాప్‌ ర్యాంకు సాధించాడు.

గరెత్‌ విజయంపై యూనివర్శిటీ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, అన్నీ అనుకున్నట్లు జరిగి తను జైలు నుంచి విడుదలైన తర్వాత.. పెంబ్రోక్‌ కాలేజీలో ఎంఫిల్‌ పూర్తిచేయాలన్నది తన కోరిక అని గరెత్‌ చెబుతున్నాడు.

English summary
A 28-year-old prisoner lodged in a high-security British jail has topped his class in a Masters course in criminology at the elite Cambridge University.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X