వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూఎస్ లేదా భారత్ పై స్పేస్ స్టేషన్ కూలొచ్చు; దానికి మీరు రెడీనా: రోస్‌కాస్మోస్‌ చీఫ్‌

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలపై రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ చీఫ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా కొత్తగా విధించిన ఆంక్షల వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పై ఇరు దేశాల సహకారం దెబ్బతినే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల స్పేస్ స్టేషన్ నియంత్రణ కోల్పోతే అమెరికా, భారత్, ఐరోపా, చైనా వంటి దేశాల పై అది పడొచ్చని హెచ్చరికలు జారీ చేశారు. రష్యాపై ఐఎస్ఎస్ తిరగదని, అందువల్ల తమ దేశానికి ఎటువంటి ముప్పు లేదని రోస్‌కాస్మోస్‌ చీఫ్‌ పేర్కొన్నారు.

పుతిన్ మెంటలోడు, బైడెన్,మోడీకి చెప్పినా ఫలితంలేదు: రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై కేఏ పాల్పుతిన్ మెంటలోడు, బైడెన్,మోడీకి చెప్పినా ఫలితంలేదు: రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై కేఏ పాల్

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం .. అమెరికా ఆంక్షలు .. స్పందించిన రోస్‌కాస్మోస్‌ చీఫ్‌

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం .. అమెరికా ఆంక్షలు .. స్పందించిన రోస్‌కాస్మోస్‌ చీఫ్‌

ఉక్రెయిన్ సైనిక చర్యలకు పాల్పడిన రష్యాను శిక్షించటం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం కఠినమైన కొత్త ఆంక్షలను ప్రకటించిన విషయం తెలిసిందే. రష్యాకు సాంకేతిక, అంతరిక్ష, సైనిక రంగాల్లో సహకారంపై పరిమితులు విధించిన విషయం తెలిసిందే. రష్యా బ్యాంకులు, ఆ దేశానికి సహకరించే వ్యక్తులు, సంస్థల పైన కూడా అమెరికా ఆంక్షలను విధించింది. దీంతో అమెరికా తాజా అంశాలపై రోస్‌కాస్మోస్‌ చీఫ్‌ డిమిత్రి రోగోజిన్స్ స్పందించారు. దీనివల్ల జరగనున్న పరిణామాలను హెచ్చరిస్తూ ట్విట్టర్ వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు.

 అంతరిక్ష కేంద్రం యూఎస్ లేదా భారత్ పై కూలొచ్చు .. ఇలాంటి సమయంలో బెదిరిస్తారా?

అంతరిక్ష కేంద్రం యూఎస్ లేదా భారత్ పై కూలొచ్చు .. ఇలాంటి సమయంలో బెదిరిస్తారా?


మీరు మా సహకారాన్ని అడ్డుకుంటే, స్పేస్ స్టేషన్ తన కక్ష్య నుంచి గతి తప్పి అమెరికా లేదా ఐరోపా పై పడితే ఎవరు కాపాడుతారో చెప్పాలంటూ ప్రశ్నించారు. సుమారు 500 టన్నుల బరువైన అంతరిక్ష కేంద్రం భాగాలు భారత్ లేదా చైనా పై పడే అవకాశం ఉందని అందులో ఆయన పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు బెదిరించాలి అనుకుంటున్నారా అంటూ అమెరికాను రోస్‌కాస్మోస్‌ చీఫ్‌ ప్రశ్నించారు.

 స్పేస్ స్టేషన్ కూలితే నష్టం మీకే .. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

స్పేస్ స్టేషన్ కూలితే నష్టం మీకే .. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా?


ఐఎస్ ఎస్ రష్యన్ మీదుగా ప్రయాణించదు కాబట్టి అది కూలితే రష్యాకు ఎలాంటి నష్టం లేదన్నారు. ఒకవేళ అది కూలితే అన్ని నష్టాలు నీకే అంటూ ఆయన పేర్కొన్నారు. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ మరో ట్వీట్ లో రోస్‌కాస్మోస్‌ చీఫ్‌ వార్నింగ్ ఇచ్చారు. అందువల్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించ వద్దంటూ అమెరికా కు సూచించారు. రష్యా "సవివరమైన ప్రతిస్పందనను ఇవ్వడానికి ముందు కొత్త US ఆంక్షలను విశ్లేషిస్తోంది" అని అన్నారు.

స్పందించిన నాసా.. అంతరిక్ష సహకారం కొనసాగుతుందన్న నాసా

స్పందించిన నాసా.. అంతరిక్ష సహకారం కొనసాగుతుందన్న నాసా

కొత్త ఆంక్షలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా స్పందించింది. అయితే, కొత్త ఆంక్షలు రెండు దేశాల మధ్య అంతరిక్ష సహకారానికి హాని కలిగించవని నాసా స్పష్టం చేసింది. రష్యాతో సంబంధాలకు దీనివల్ల ఎలాంటి ముప్పు ఉండబోదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సురక్షిత ఆపరేషన్ల కోసం రష్యా తో పాటు అంతర్జాతీయ భాగస్వాములతో కూడా కలిసి పని చేస్తుందని నాసా ఒక ప్రకటనలో పేర్కొంది. కొత్త ఎగుమతి నియంత్రణ చర్యలు యూఎస్ -రష్యా పౌర అంతరిక్ష సహకారాన్ని అనుమతించేలా కొనసాగుతాయి. ఎటువంటి మార్పులు ప్రణాళిక చేయబడవు అని నాసా పేర్కొంది.

English summary
The head of the Russian space agency Ross Cosmos has flagged in earnest over US sanctions in the wake of the Russian invasion of Ukraine. He warned that if the space station lost control, it could hit countries like the United States, India, Europe and China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X