Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నెతన్యాహు అంతమే లక్ష్యం.. ఇరాన్ "రివల్యూషనరీ గార్డ్స్" శపథం !!

ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు హత్యకు గురయ్యారనే వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో.. Islamic Revolutionary Guard Corps (IRGC) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విడుదల చేసిన ప్రకటనలో ఆయనను "పిల్లల హంతకుడు"గా అభివర్ణిస్తూ.. అతను బతికే ఉన్నా కూడా వెంబడించి చంపుతామని హెచ్చరించింది. గార్డ్స్ నిర్వహించే 'సెపా న్యూస్' వెబ్‌సైట్‌లో ఈ ప్రకటన ప్రచురితమైంది.

హత్య వార్తలను ఖండించిన ఇజ్రాయెల్..

ఇదే సమయంలో నెతన్యాహు హత్యకు గురయ్యారనే వార్తలను ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం పూర్తిగా ఖండించింది. ప్రధాని క్షేమంగా ఉన్నారని స్పష్టం చేస్తూ ప్రజలను వదంతులను నమ్మవద్దని కోరింది. అధికారిక ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటలకే ఐఆర్‌జీసీ ఈ బెదిరింపులు చేయడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

war-between-israel-and-iran-conflicts-leads-to-iran-s-revolutionary-guards-vows-to-target-prime-mini

ఈ వదంతులకు ప్రధాన కారణం నెతన్యాహు సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియో. ఆ వీడియోలో ఆయన చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపించడంతో అది మార్ఫింగ్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన వీడియో కావచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఆరోగ్యం లేదా భద్రతపై అనేక ఊహాగానాలు వ్యాపించాయి.

అదే సమయంలో నెతన్యాహు కుమారుడు Yair Netanyahu మార్చి 9 తర్వాత సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేయకపోవడం కూడా వదంతులకు కారణమైంది. కుటుంబంలో ఏదైనా విషాదం జరిగి ఉండవచ్చని కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఊహాగానాలు చేశారు.

గ్రోక్ క్లారిటీ..

ఈ వదంతులపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xకు చెందిన AI చాట్‌బాట్ Grok స్పందించింది. వీడియోలో కనిపించిన ఆరు వేళ్లు కేవలం కెమెరా కోణం లేదా దృశ్య భ్రమ వల్లే కనిపించాయని స్పష్టం చేసింది. వీడియోలో ఎలాంటి మార్పులు చేయలేదని కూడా తెలిపింది. అలాగే నెతన్యాహు హత్యకు గురయ్యారన్న ప్రచారం పూర్తిగా నకిలీ వార్తలేనని పేర్కొంది.

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత

ఇక ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య వైరం చాలా కాలంగా కొనసాగుతోంది. ముఖ్యంగా 2023 అక్టోబర్ 7న ఇరాన్ మద్దతుతో పనిచేసే Hamas ఇజ్రాయెల్‌పై దాడి చేసిన తర్వాత ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఆ దాడి తర్వాత ఇజ్రాయెల్ గాజా ప్రాంతంలో భారీ సైనిక చర్యలు చేపట్టింది. గత సంవత్సరం United States జోక్యంతో ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య 12 రోజుల పాటు తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఈ సంఘర్షణలో రెండు దేశాల మధ్య క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు జరిగి పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది.

ఇరాన్ అణు కార్యక్రమంపై జరుగుతున్న అంతర్జాతీయ చర్చల సమయంలో అమెరికా - ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ Ali Khamenei మరణించారనే వార్తలు గతంలో పెద్ద సంచలనం సృష్టించాయి. ఆ ఘటన తర్వాత ఇరాన్ ప్రతీకార చర్యలు ప్రారంభించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రాంతీయ యుద్ధంగా మారిన ఘర్షణ

ఇరాన్ ప్రతీకారంగా ఇజ్రాయెల్ మరియు అమెరికా స్థావరాలపై మాత్రమే కాకుండా మధ్యప్రాచ్య ప్రాంతంలోని వాటి మిత్రదేశాలపై కూడా దాడులు ప్రారంభించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ పరిణామాల వల్ల ప్రాంతంలో పూర్తి స్థాయి యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయ ఆందోళన

ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య విభేదాలు మరింత తీవ్రమైతే అది ప్రపంచ రాజకీయాలు, చమురు మార్కెట్, అంతర్జాతీయ భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+