Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇరాన్ ఆర్మీ జనరల్ మృతి- కూలిన మరో మూలస్తంభం

ఇరాన్‌పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకే ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకూ పాకింది. యుద్ధం 21వ రోజుకు చేరుకోగా దీనికి ముగింపు కనపించట్లేదు. గల్ఫ్ ప్రాంతంలో ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ ప్రయాణాలు, భద్రతకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇది అనేక దేశాల్లో వేలాది మంది ప్రయాణికులను చిక్కుకుపోయేలా చేస్తోంది.

ఈ యుద్ధంలో ఇప్పటివరకు 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది ఇరాన్‌లోనే కాగా, లెబనాన్, గల్ఫ్ దేశాల్లో కూడా మరణాలు నమోదయ్యాయి. దశాబ్దాల తర్వాత తొలిసారిగా గల్ఫ్ ప్రాంతం యుద్ధ ముఖద్వారంలో నిలిచింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

IRGC Spokesman General Ali Mohammad Naeini Killed in Aerial Strike as Iran Loses Top Military Cadre

ఈ పరిణామాల మధ్య ఇరాన్ కు భారీ నష్టం సంభవించింది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రతినిధి అలీ మహమ్మద్ నైనీ మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు అధికారిక మీడియా మెహర్ న్యూస్ ప్రకటన విడుదల చేసింది. బ్రిగేడియర్ జనరల్ అలీ మహమ్మద్ నైనీ ఐఆర్‌జీసీకి ప్రతినిధిగా, ప్రజా సంబంధాల ఉప ప్రధాన అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2024 జూలైలో ఐఆర్‌జీసీ కమాండర్ ఇన్ చీఫ్ హుస్సేన్ సలామీ ఆయనను ఈ పదవిలో నియమించారు.

1957లో జన్మించిన నైనీ ఇరాన్-ఇరాక్ యుద్ధంలో నేరుగా పాల్గొన్నారు. తదనంతరం ఐఆర్‌జీసీలో వివిధ హోదాల్లో పని చేశారు. ఇరాన్ ఆర్మీలో బ్రిగేడియర్ జనరల్ స్థాయికి చేరుకున్నారు. ఇరాన్ సైనిక సంసిద్ధత, క్షిపణి, డ్రోన్ సామర్థ్యాలపై తరచూ హెచ్చరికలు జారీ చేస్తుండేవారు. ఇటీవలే మీడియా ముందుకొచ్చారాయన. కనీసం ఆరు నెలల పాటు కొనసాగే యుద్ధానికి ఇరాన్ అన్ని విధాలా సంసిద్ధంగా ఉందని, అమెరికా, ఇజ్రాయెల్ ను దెబ్బకొట్టి తీరుతామని హెచ్చరించారు.

ఇజ్రాయెల్ దాడిలో ఆయన మరణించడం ఇరాన్‌కు వ్యూహాత్మకంగా పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. మరోవైపు ఇరాన్ కు సంబంధించిన 130కి పైగా మౌలిక సదుపాయాల స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. పశ్చిమ, మధ్య ఇరాన్‌లోని బాలిస్టిక్ క్షిపణి స్థావరాలు, మానవ రహిత వైమానిక వాహనాలు, రక్షణ వ్యవస్థలు వీటిల్లో ఉన్నాయని పేర్కొంది.

మూడు రోజుల కిందటే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీ, బసిజ్ యూనిట్ కమాండర్ ఘోలమ్రెజా సోలెమానీని మరణించారు. అంతలోనే ఆర్మీకి సంబంధించిన మరో బ్రిగేడియర్ జనరల్ స్థాయిలో అధికారి మృతి, చెందడం ఇరాన్ కు భారీ నష్టంగా పరిగణిస్తోన్నారు. అలీ మహ్మద్ నైనీ, లారిజానీ, ఘోలమ్రెజా సోలేమానీ, అతని డిప్యూటీ సయ్యద్ కరీషీలు ఈ రెండు, మూడు రోజుల్లోనే మరణించడం పెద్ద దెబ్బగా భావిస్తోన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+