ఐసిస్ ముందే హెచ్చరించిందా?: మాంచెస్టర్ ఎటాక్‌లో వెలుగుచూసిన నిజం!?..
బాంబు పేలుడుకు కొద్ది గంటల ముందు ట్విట్టర్ లో దర్శనిమిచ్చిన ఈ ట్వీట్.. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్విట్టర్ నుంచి తొలగించబడింది.
మాంచెస్టర్: ఆత్మాహుతి దాడితో ఇంగ్లాండు ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. సంగీతంలో ఓలలాడుతున్న మాంచెస్టర్ ప్రజలు.. ఆత్మాహుతి దాడితో ఒక్కసారి భీతావహులుగా మారిపోయారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఐసిస్ ఉగ్రవాద సంస్థ నుంచి ముందస్తు హెచ్చరిక వెలువడినట్లు తెలుస్తోంది.
సంగీత కచేరీ కార్యక్రమానికి ఒక గంట ముందు ట్విట్టర్ ద్వారా ఐసిస్.. ఆత్మాహుతి దాడి జరగబోతున్నట్లు పేర్కొందని సమాచారం. మాంచెస్టర్ అరెనా హ్యాష్‌ట్యాగ్‌తో చేసిన ఈ ట్వీట్‌లో తమ హెచ్చరికకు ఐసిస్ జెండాను జతచేశారు. 'మా దాడిని మరిచిపోయారా? భయం అంటే ఇదే' అంటూ ఐసిస్ ఉగ్రవాదులు అందులో పేర్కొన్నారు.

బాంబు పేలుడుకు కొద్ది గంటల ముందు ట్విట్టర్ లో దర్శనిమిచ్చిన ఈ ట్వీట్.. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్విట్టర్ నుంచి తొలగించబడింది. దాడి అనంతరం తమ ఎటాక్ విజయవంతమైందంటూ ఐసిస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకోవడం గమనార్హం.
ముసుగులు ధరించిన కొంతమంది వ్యక్తులు.. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాదు, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ఇలాంటివి చాలా జరుగుతాయని వారు హెచ్చరించారు. కాగా, దాడికి సంబంధించి ఐసిస్ నుంచి మాత్రం ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications