Israel-Iran War: ఇజ్రాయెల్ పై యుద్ధానికి తొలి అడుగు వేసిన ఇరాన్..!
సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై అనూహ్యంగా దాడి చేసి సైనిక జనరళ్లను హతమార్చిన ఇజ్రాయెల్ పై యుద్ధానికి సిద్దమవుతున్న ఇరాన్.. అందులో భాగంగా ఇవాళ తొలి అడుగు వేసింది. హార్ముజ్ జలసంధిలో ఇజ్రాయెల్ కు చెందిన ఓ కార్గో నౌకను పట్టుుకుని సీజ్ చేసింది. దీంతో ఇజ్రాయెల్ మండిపడింది. పర్యవసానాలు తప్పవని ఇజ్రాయెల్ ఆర్మీ ఇరాన్ కు హెచ్చరికలు జారీ చేసింది.
ఇరాన్ రివల్యూషనరీ గార్డులు ఇవాళ హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఇజ్రాయెల్ కార్గోషిప్ ను సీజ్ చేశారు. ఇరాన్ గార్డులతో కూడిన హెలికాఫ్టర్ ఈ షిప్ పై దిగి దాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ ఓడపై పోర్చుగీసు జెండా కూడా ఉంది. ఈ విషయాన్ని ఇరాన్ కు చెందిన ఇర్నా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అనంతరం ఇరాన్ దీనిపై బహిరంగ ప్రకటనే చేసింది. ఇజ్రాయెల్ కార్గోషిప్ ను యూఏఈ-ఇరాన్ మధ్య సీజ్ చేసినట్లు ప్రకటించింది.

దీనిపై ఇజ్రాయెల్ వెంటనే స్పందించింది. ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి, రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి ఈ కార్గో షిప్ ను స్వాధీనం చేసుకున్న వార్తలపై స్పందిస్తూ.. ఇరాన్ ఈ ఉద్రిక్తతల్ని మరింత పెంచడానికి ప్రయత్నిస్తున్నందున దాి పర్యవసానాల్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు ఈ వ్యవహారంపై అమెరికా కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరాన్ త్వరలోనే ఇజ్రాయెల్ పై యుద్దం మొదలుపెట్టబోతోందని ప్రకటించారు.












Click it and Unblock the Notifications