Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇజ్రాయెల్ దాడులు: లెబనాన్‌లో మేయర్ సహా 20 మంది మృతి

లెబనాన్‌లో హెజ్‌బొల్లా మిలిటెంట్ల స్థావరాలు, ముఖ్య నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తోంది. వైమానిక దాడులపై అమెరికా అభ్యంతరం తెలిపినప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆరు రోజుల తర్వాత బీరూట్ లోని దక్షిణ ప్రాంతంతోపాటు ఇతర ప్రదేశాల్లో బుధవారం భారీ ఎత్తున వైమానిక దాడులు జరిపింది. బీరూట్‌లో నివాస భవనం కింద ఉన్న హెజ్బొల్లా ఆయుధ గోదాంపై దాడి చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.

ఆప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ మిలిటరీ ఎక్స్‌లో హెచ్చరిక పోస్టు చేసిన గంట తర్వాత మొదటి దాడి జరిగింది. అనంతరం మరో రెండు దాడులు జరిపింది. కాగా, నబతిహ్‌ మున్సిపాలిటీ భవనంపై జరిగిన దాడిలో మేయర్‌ సహా 20 మంది మృతి చెందారు. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనే అంశంపై సమావేశం జరుగుతుండగా ఐడీఎఫ్ దాడి చేసినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. భవనాల శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు.

Israeli attacks 20 dead including mayor in Lebanon

కాగా, బీరుట్‌పై దాడులు తగ్గుతాయని అమెరికా హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇజ్రాయెల్‌ దాడులు ఆపడటం లేదని లెబనాన్‌ తాత్కాలిక ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. నబతిహ్‌ నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో 30 నిమిషాల వ్యవధిలో 11 దాడులు జరిగినట్లు గవర్నర్‌ వెల్లడించారు. ఇక, మంగళవారం లెబనాన్ దక్షిణ ప్రాంతంలోని కానా పట్టణంలో జరిగిన దాడుల్లో మృతుల సంఖ్య 15కు పెరిగింది. మరోవైపు, తమ భూభాగంపై 90 రాకెట్లతో హెబ్బొల్లా దాడులు చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.

ఇక, మంగళవారం పొద్దుపోయిన తర్వాత లెబనాన్‌ దక్షిణ ప్రాంతంలోని కానా పట్టణంలో జరిగిన దాడుల్లో మృతుల సంఖ్య 15కు పెరిగినట్లు లెబనాన్‌ అధికారులు తెలిపారు. భవనాల శిథిలాల కింద నుంచి 15 మృతదేహాలు బయటకు తీసినట్లు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. తమ భూభాగంపై 90రాకెట్లతో హెజ్‌బొల్లా దాడులు చేసినట్లు IDF ప్రకటించింది. ఈ దాడులు ఏ ప్రాంతంపై జరిగాయనేది వెల్లడించలేదు.

ఇటీవల లెబనాన్‌లోని అపార్ట్‌మెంటుపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో 12 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా 22 మంది చనిపోయారు.ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంస్థ స్వతంత్ర విచారణకు ఆదేశించింది. అయితే, హెజ్బొల్లా, హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+