వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుతిన్‌తో ఇజ్రాయెత్ ప్రధాని భేటీ.. ఉక్రెయిన్ గురించి చర్చ

|
Google Oneindia TeluguNews

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం కొనసాగుతూనే ఉంది. మధ్యలో కొంత బ్రేక్ ఇచ్చిన వార్ మాత్రం కంటిన్యూ అవుతుంది. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బాన్నెట్ ..పుతిన్‌ను మీట్ అయ్యారు. శనివారం క్రెమ్లిన్‌లో ఇరువురు నేతలు కలిసి.. ఉక్రెయిన్ అంశాన్ని చర్చించారు. ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వ వహించడానికి మరోసారి ఇజ్రాయెల్ సిద్దంగా ఉంది. ఇజ్రాయెల్ అమెరికాతో సన్నిహితంగా ఉంటోంది. కివ్‌లో రష్యా దాడిని తొలి నుంచి ఖండించింది. మానవతా దృక్పథంతో స్పందించాలని కోరింది.

ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. విదేశీయులను బందీలుగా ఉంచడానికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందని.. దీంతో బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉంటుందని పుతిన్ తెలిపారు. ఇటు భారత్ ఆపరేషన్ గంగా చేపట్టింది. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థుల తరలింపు ప్రక్రియ చేపట్టింది. ఇప్పటి వరకు 18 నుంచి 20 వేల మంది విద్యార్థులను సురక్షితంగా తరలించారు. పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సిందియా రంగంలోకి దిగారు. అయితే అంతకుముంద ఓ విద్యార్థి చనిపోగా.. మరో విద్యార్థి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మృతిచెందాడు.

 Israeli Prime Minister Meets Putin In Moscow To Discuss Ukraine Crisis

ఇటు కర్ణాటకలోని హవేరి జిల్లాకు చలగేరి గ్రామానికి చెందిన నవీన్ శేఖరప్ప.. ఖర్కివ్‌లో స్టోర్‌‌కు వెళ్లిన సమయంలో బాంబుల దాడి జరిగింది. దీంతో అతను తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్‌.. మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. నవీన్ కుటుంబసభ్యులతో కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై ఫోన్‌‌లో మాట్లాడారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆదేశాల‌తో ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ నిన్ననే రంగంలోకి దిగిపోయింది. విదేశాంగ శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఉక్రెయిన్‌లోని భార‌తీయుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు సీ-17 విమానాల‌ను ఉక్రెయిన్ పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను అక్క‌డి నుంచి త‌ర‌లించేందుకు స‌హ‌క‌రించాల‌ని అటు ఉక్రెయిన్‌తో పాటు ఇటు ర‌ష్యాను కోరాల‌ని విదేశాంగ శాఖ‌కు మోడీ ఆదేశాలు జారీ చేశారు.

English summary
Israeli Prime Minister Naftali Bennett met with Russian President Vladimir Putin in the Kremlin on Saturday to discuss the Ukraine crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X