ఇరాన్ పై ఇజ్రాయెల్ "మొస్సాద్ సీక్రెట్ ఆపరేషన్".. అసలు ఏంటా స్టోరీ ?
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ చేపట్టిన "ఆపరేషన్ రైజింగ్ లయన్" ఇరాన్‌ను గట్టిగా దెబ్బతీశాయి. ఈ దాడుల్లో ముఖ్యంగా అణు కేంద్రాలు, బల్లిస్టిక్ మిస్సైల్ స్థావరాలు, సైనిక కేంద్రాలు, శాస్త్రవేత్తల నివాసాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హొస్సేన్ సలామీ, మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి సహా పలువురు సీనియర్ జనరల్స్ ప్రాణాలు కోల్పోయారు.
ఈ క్రమంలోనే హబైబొల్లా సయ్యారిను మిలిటరీ చీఫ్‌గా, అహ్మద్ వాహిదిని ఐఆర్‌జీసీ చీఫ్‌గా నియమించారు. ఇజ్రాయెల్ నిఘాసంస్థ "మొస్సాద్" కీలక పాత్ర పోషించిందన్నది ఇప్పుడు ఓపెన్ సీక్రెట్. ఇజ్రాయెల్ వైమానిక దళం ఈ దాడిలో 200కి పైగా యుద్ధ విమానాలతో పాల్గొంది. ఫైటర్ జెట్లు, రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, నిఘా విమానాల సహకారంతో మొత్తం 100 టార్గెట్లపై 330 బాంబులు, క్షిపణులతో దాడులు జరిపింది. ఈ దాడుల వెనుక ఇజ్రాయెల్ నిఘాసంస్థ "మొస్సాద్" కీలక పాత్ర పోషించిందన్నది ఇప్పుడు ఓపెన్ సీక్రెట్. దీంతో ఈ సంస్థ గురించి తీవ్ర చర్చ నడుస్తోంది.

ఏంటి మొస్సాద్ ..?
మొస్సాద్ (Mossad) అనేది ఇజ్రాయెల్ ప్రభుత్వానికి చెందిన గూఢచారుల (intelligence) సంస్థ. ఇది బహిరంగంగా కాకుండా రహస్యంగా (covert) దేశానికి సంబంధించిన భద్రతా, శత్రుదేశాల సమాచారం, హత్యలు, హ్యాకింగ్ వంటి కీలక కార్యకలాపాలు నిర్వహిస్తుంది. డ్రోన్ అటాక్స్, స్నైపర్స్, రిమోట్ కంట్రోల్ ఆయుధాలు, ఎవరికీ తెలియకుండా లక్ష్యాన్ని నాశనం చేయడమే ఈ ఆపరేషన్ల లక్ష్యం.
కాగా ఇజ్రాయెల్ దాడులకు మార్గం సుగమం చేయడంలో మొస్సాద్ నిఘా సంస్థ రహస్య ఆపరేషన్లు కీలక పాత్ర పోషించాయి. సుప్రసిద్ధ "S.E.A.D." (Suppression of Enemy Air Defenses) స్ట్రాటజీ కింద మొస్సాద్ ఇరాన్‌లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్‌లు, కంట్రోల్ సెంటర్లలో పేలుళ్లు, డేటా హ్యాకింగ్ ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థలలో అంతరాయం కలిగించినట్టు సమాచారం. ఇజ్రాయెల్ దాడుల్లో నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసం అయిందని IAEA ప్రకటించింది. ఈ కేంద్రం ఇరాన్ అణు కార్యక్రమానికి గుండె లాంటి ప్రదేశంగా పరిగణించబడుతుంది. గతంలో 2021లోనూ ఇక్కడ జరిగిన బాంబ్ బ్లాస్ట్ ద్వారా పలు సెంట్రిఫ్యూజ్‌లు ధ్వంసమయ్యాయి. రాబోయే రోజుల్లో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

మొస్సాద్ గత ఆపరేషన్లు..
1976 - ఉగాండాలో హైజాక్ అయిన విమానంలో ఉన్న ఇజ్రాయెల్ పౌరులను కాపాడేందుకు జరిపిన ఆపరేషన్.
2018 - తెహ్రాన్‌లోని ఓ వేర్‌హౌస్ నుంచి అణు రహస్య డాక్యుమెంట్లను చోరీ చేసిన మొస్సాద్, దీనివల్లే ప్రపంచానికి ఇరాన్ అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని తెలిసింది.
2020 - నతాంజ్ అణు కేంద్రంపై సైబర్ ఆపరేషన్ చేసి యురేనియం శుద్ధి కేంద్రాన్ని అస్థవ్యస్థం చేయడం.
2020 - టాప్ న్యూక్లియర్ శాస్త్రవేత్త మొహసెన్ ఫక్రిజాదే హత్య (ఆటోమేటిక్ గన్‌తో రిమోట్ కంట్రోల్ హత్య).
2022 - 100కి పైగా డ్రోన్ల నాశనం చేసే ఆపరేషన్.
2023 - తెహ్రాన్‌లో మొస్సాద్ సభ్యుల తూర్పు యూరోపియన్ సపోర్ట్‌తో నిర్వహించిన 'మల్టీ లేయర్డ్' హ్యాకింగ్ ఆపరేషన్.
-
యుద్ధంలోనూ కొత్త శకం.. డ్రోన్లతో వార్, పశ్చిమాసియాలో 10వేల అమెరికా మెరోప్స్ డ్రోన్లు! -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
IRAN: హార్ముజ్ లో భారత నౌకలపై తేల్చేసిన ఇరాన్ రాయబారి..! -
Indigo: ప్రయాణికులకు ఇండిగో బిగ్ షాక్..! రేపటి నుంచి ఛార్జీల పెంపు ఇలా..! -
US Refueling Aircraft Crash: ఇరాన్ వార్ లో అమెరికాకు అతిపెద్ద షాక్..! -
తల తెగినా పోరాడే సైన్యం! అమెరికాను వణికిస్తున్న జఫారీ! -
"హార్మూజ్ జలసంధి మూసే ఉంటుంది.. అమెరికాను వదలం" -
Iran: చమురు మంటలే-తేల్చేసిన ఇరాన్- 200 డాలర్లకు బ్యారెల్..! -
ఇరాన్‌తో పోరు.. ఆరు రోజుల్లో రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన అమెరికా !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!










Click it and Unblock the Notifications