భర్తకు విడాకులిచ్చి చాలా బాధపడ్డా: జెన్నీఫర్ లోపేజ్
లాస్ ఏజెంల్స్: తన భర్త మార్క్ ఆంటోనీతో విడిపోవడమే తన జీవితంలో అత్యంత విషాదకర సంఘటన అని హాలీవుడ్ నటి జెన్నీఫర్ లోపేజ్(44) తెలిపింది. విడాకులు తీసుకున్న తర్వాత తాను ఎంతో బాధపడ్డానని తెలిపింది. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితం అనంతరం, 2012లో మార్క్ ఆంటోనీ, లోపెజ్‌లు విడాకులు తీసుకుని విడిపోయారు. కాగా, తన భర్త నుంచి విడాకులు తీసుకోవడంపై జెన్నీఫర్ లోపేజ్ ప్రస్తుతం విచారం వ్యక్తం చేస్తోంది.
మార్క్ ఆంటోనీతో విడిపోయాక తన జీవితం దుర్భరంగా మారిందని వాపోయింది. ఎన్నడూ లేనంతగా తన జీవితంలో విషాదం అలుముకున్నట్లుగా ఉందని వెల్లడించింది. కొద్ది కాలంపాటు ఆ ఘటన గురించి తలచుకుని చాలా బాధపడినట్లు పేర్కొంది.

ప్రస్తుతం తాను ఆ బాధ నుంచి కొంత తేరుకుంటున్నట్లు తెలిపింది. ఇక తన జీవితాన్ని ఎవరో ఒకరితో పంచుకోవాలనుకుంటున్నానని లోపేజ్ తెలిపింది. కాగా, గత రెండేళ్ల నుంచి తన ప్రియుడు డాన్సర్ కాస్పర్ స్మార్ట్‌తో జెన్నీఫర్ లోపేజ్ డేటిగ్ చేస్తోంది.
తన ఆరేళ్ల కవల పిల్లలు ఎమ్మి, మాక్స్‌లు తనకు ప్రేమ పాఠాలు చెబుతున్నారని చెబుతోంది. తను తల్లి అయిన తర్వాతనే తనకు సంపూర్ణత్వం వచ్చిందని జెన్నీ తెలిపింది. కాగా, 2014 సంవత్సరానికి గానూ జెన్నీఫర్ లోపేజ్ బిల్ బోర్డ్ మ్యూజిక్ అవార్డు గెలుచుకుని ఆ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications