కాబూల్ బాంబు పేలుడు మా పనే: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రకటన
ఈ మేరకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్&సిరియా ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, ఈ పేలుడు ధాటికి భారీ విధ్వంసం చోటు చేసుకుంది.
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయానికి సమీపంలో బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. 80మంది దాకా మృత్యువాత పడ్డ ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు పేలుళ్లకు పాల్పడిందెవరు? అన్నదానిపై స్పష్టత లేకపోగా.. తాజాగా ఈ పనిచేసింది తామేనని ప్రకటించింది ఐసిస్.
ఈ మేరకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్&సిరియా ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, ఈ పేలుడు ధాటికి భారీ విధ్వంసం చోటు చేసుకుంది. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి భారత, జర్మనీ రాయబారి కార్యాలయాలకు కేవలం 50 మీటర్ల దూరంలో మాత్రమే ఉండటం గమనార్హం.

ఈ పేలుడు ఘటనపై వెంటనే స్పందించిన అక్కడి భద్రతా సిబ్బంది వెంటనే ఎంబసీ ఉద్యోగులను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు.పేలుడు ధాటికి భారత రాయబార కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. భారత సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. అఫ్ఘనిస్థాన్‌కు వీలైనంత సాయం చేస్తామని భారత్ తెలిపింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications