హోటల్‌పై ఉగ్రవాదుల దాడి: పలువురి మృతి
కాబూల్: ఆఫ్ఘనస్థాన్‌లో ఉగ్రవాదులు తీవ్ర విధ్వంసానికి పాల్పడ్డారు. ఓ ఫైవ్‌స్టార్ హోటల్ లో ఉగ్రవాదులు ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులకు దిగారు. దీంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది.
శనివారం రాత్రి సాయుధులైన ఆగంతకులు కాబూల్‌లోని ఫైవ్‌స్టార్ హోటల్‌లోకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం భారీగానే సంభవించినట్లు సమాచారం.

కాబూల్‌లోని ఇంటర్ కాంటినెంటల్ ప్రసిద్ది చెందింది.. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో హోటల్ వంట గది ద్వారా ప్రవేశించిన దుండగలు విచక్షణ రహితంగా కాల్పులు ప్రారంభించారు.
ఆపై గ్రేనేడ్ దాడులు చేయటంతో మంటలు ఎగసిపడ్డాయి. ఘటన నుంచి తప్పించుకున్న హోటల్ మేనేజర్ అహ్మద్ హరిస్ నయబ్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించాడు. ఉగ్రవాదులు పెద్ద ఎత్తున హ్యాండ్ గ్రేనేడ్‌లతో హోటల్‌లోకి ప్రవేశించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు భద్రతా దళాలు ప్రకటించాయి.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications