వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లికి కట్నంగా బెల్టు బాంబులు.. తుపాకులు..

|
Google Oneindia TeluguNews

లిబియా : ఐఎస్ఐఎస్ దురాగతాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. తాజాగా లిబియా సైన్యం జరిపిన దాడుల్లో ఐసిస్ పాశవిక చర్యల్లో మరో కోణం వెలుగు చూసింది. పెళ్లిళ్లకు కట్నంగా ఆత్మాహుతి బాంబులను, రైఫిల్స్ ను పెళ్లి కూతుళ్లకు ఇచ్చే సాంప్రాదాయాన్ని కొనసాగిస్తోంది ఐసిస్. లిబియా సైన్యం జరిపిన తనిఖీల్లో ఈ ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి.

ISIS

లిబియాలోని కోస్తా పట్టణమైన సిర్టేను ఐసిస్ ఇదివరకే తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. తనిఖీల్లో భాగంగా బయటపడ్డ పెళ్లి డాక్యుమెంట్లను చూసి లిబియా సైన్యం కంగు తిన్నది. సైన్యం పరిశీలించిన డాక్యుమెంట్లలో వివాహానికి కట్నంగా పెళ్లి కూతురుకు తుపాకులను, ఆత్మాహుతి బెల్టు బాంబులను ఇచ్చిపుచ్చుకున్నట్లుగా తేలింది.

అంతేకాదు, జీహాదీలకు జ్యుడీషియల్, కంప్లయింట్స్ డిపార్ట్ మెంట్స్ కూడా ఐసిస్ నిర్వహిస్తోందని లిబియా తనిఖీల్లో స్పష్టమైంది. వీటి ద్వారానే వివాహా సమస్యలన్నింటికీ ఐసిస్ పరిష్కార మార్గాలు చూపేదని లిబియా సైన్యం పేర్కొంటున్నది. మిరియం అనే ఓ నైజీరియా మహిళ వివాహ డాక్యుమెంట్ల ద్వారా ఈ విషయాలను లిబియా సైన్యం ధ్రువీకరించింది. 2015 నవంబర్ 31న జరిగిన మిరియం వివాహాంలో ఆమెను పెళ్లి చేసుకున్న అబు మౌన్సర్ అనే ట్యూనీషియా పురుషుడు తాను మరణించినా, లేదా విడాకులు తీసుకున్నా మిరియంకు బెల్టుబాంబును కట్నంగా ఇస్తానని మ్యారేజ్ డాక్యుమెంట్లలో పేర్కొన్నట్టు సమాచారం.

English summary
Libya army found out the strange things in marriage documents of miriyam, isis was did this marriage and mentioned weapons as dowry from bridegroom in documents
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X