వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీస్ శిక్షణ కేంద్రంపై బాంబు దాడి: 40మంది మృతి

|
Google Oneindia TeluguNews

ట్రిపోలి: లిబియా దేశం జ్లిటెన్ పట్టణంలోని పోలీసు శిక్షణ కేంద్రంపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 30 మంది దాకా గాయపడ్డారు.

శిక్షణా కేంద్రంలో దాదాపు 400 మందికి పైగా పోలీసు శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది ఐసిస్‌ ఉగ్రవాదులేనని అధికారులు భావిస్తున్నారు.

బాంబు దాడి నేపథ్యంలో లిబియా ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. భద్రతా సిబ్బంది క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. కాగా, లిబియాలో జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి మార్టిన్ కోబ్లర్ ఖండించారు.

English summary
At least 40 people have been killed in a bomb attack on a police training centre in the western Libyan town of Zliten, the town’s mayor has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X