నూతన ఇయర్ వేళ విషాదం.. జపాన్‌లో భూకంపం..
న్యూ ఇయర్ వేళ జపాన్ లో విషాదం నెలకొంది. జపాన్ లోని నోడా ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 6 గా నమోదైంది. ఈ విషయాన్ని యూనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ధ్రువీకరించింది. 19.3 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇటీవల ఈశాన్య జపాన్ లోని కుజీ పట్టణంలో భూమి కంపించిన విషయం తెలిసిందే. దీని తీవ్రత 6.7గా నమోదైంది.
జపాన్‌లో న్యూ ఇయర్ వేళ భూకంపం సంభవించింది. తూర్పు నోడా ప్రాంతంలోని తీరంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6 గా నమోదైంది. 19.3 కి.మీ లోతులో భూకంపం కేంద్రీకృతం అయినట్లు యూనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. నూతన సంవత్సరం రోజే భూమి కంపించడంతో జపాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇటీవల వరుసగా భూకంపాల ధాటికి జపాన్ ప్రభావితం అవుతుంది. ఈ నెల 8 న జపాన్ తూర్పు తీరంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం 7.5 తీవ్రతతో ఉంది. ఆ తర్వాత 12 వ తారీఖున 6.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. ఇక జపాన్ లో వరుస భూకంపాలకు కారణం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ కు చేరువలో జపాన్ ఉండటమే అని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications