వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్‌లో భూకంపం ఇలా: సునామీ హెచ్చరికలు(వీడియో)

జపాన్‌ కాలమానం ప్రకారం ఉదయం 6.00గంటల సమయంలో భూకంపం సంభవించింది.

|
Google Oneindia TeluguNews

టోక్యో: జపాన్‌ను భూకంపం మరోసారి భయాందోళనకు గురిచేసింది. తూర్పు జపాన్‌లో మంగళవారం తెల్లవారుజామున 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనిని అమెరికా భూభౌతిక సర్వే సంస్థ ధ్రువీకరించింది.
కాగా, భూకంపం సమయంలో సముద్రంలోని అలలు దాదాపు 3మీటర్ల ఎత్తున ఎగసిపడటంతో సునామీ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జపాన్‌ కాలమానం ప్రకారం ఉదయం 6.00గంటల సమయంలో భూకంపం సంభవించింది.

భూమికి 11 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం లేదు. టోక్యోలోని కొన్ని తీరప్రాంతాల్లో నివసించే ప్రజల నివాసాలను ఖాళీ చేయిస్తున్నారు.

2011లో సంభవించిన భూకంపంలో ఫుకుషిమా అణువిద్యుత్తు కేంద్రం ధ్వంసమైన విషయం తెలిసిందే. జపాన్‌ భూకంప ప్రభావిత ప్రదేశంలో ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా సంభవించే 20శాతం భూకంపాలు ఇక్కడే నమోదవుతున్నాయి.

English summary
An earthquake with a preliminary magnitude of 7.3 struck northeastern Japan's Fukushima on Tuesday, a weather agency said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X