• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విస్తుపోయే కుట్ర: లండన్‌ను సర్వనాశనం చేయాలనుకున్న ఉమర్ అహ్మద్..

|

లండన్: ఉగ్ర కార్యకలాపాలతో లండన్‌లో పెను విధ్వంసానికి వ్యూహ రచన చేసిన ఉమర్ అహ్మద్ హక్(25) అనే వ్యక్తిని బ్రిటీష్ కోర్టు శుక్రవారం దోషిగా తేల్చింది. విద్యార్హత లేకున్నా ఐదేళ్లుగా అతనో మదర్సాలో టీచర్‌గా పనిచేస్తున్నట్టు గుర్తించారు.

ఐసిస్(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్&సిరియా) దాడుల నుంచి స్ఫూర్తి పొందిన ఉమర్.. లండన్‌లో ఆ తరహా దాడులు చేసేందుకు పెద్ద కుట్రలే పన్నాడు.

కొంతమంది విద్యార్థులను ఆకర్షించి వారి మెదళ్లలో ఉగ్రవాదాన్ని నూరిపోశాడు. 'ఆర్మీ ఆఫ్ చిల్డ్రన్' పేరుతో చిన్నారులను ఉగ్రవాదులుగా మారుస్తున్నాడు.

ఉగ్ర జాబితాలో.. టార్గెట్-30

ఉగ్ర జాబితాలో.. టార్గెట్-30

30 అంశాలతో కూడిన ఓ జాబితా సిద్దం చేసుకుని తమ ఉగ్ర కార్యకలాపాలను ఉమర్ అమలు చేయాలనుకున్నట్టు తేలింది. అందులో బిగ్ బెన్,ది ట్యూబ్,వెస్ట్ ఫీల్డ్ షాపింగ్ సెంటర్, హీత్రో ఎయిర్ పోర్ట్,కోర్టులు, షియా ముస్లిమ్స్,జర్నలిస్టులు, హక్కుల సంఘాల పేర్లు ఉన్నట్టు గుర్తించారు.

 ఆ స్ఫూర్తితోనే.. 'డెత్ స్క్వాడ్'

ఆ స్ఫూర్తితోనే.. 'డెత్ స్క్వాడ్'

గతేడాది మార్చి 22న లండన్‌లో వెస్ట్‌ మినిస్టర్‌ బ్రిడ్జిపైకి కారుతో వేగంగా దూసుకొచ్చిన ఉగ్రవాది నలుగురు పాదచారుల ప్రాణాలను తొక్కి చంపడంతో పాటు, బ్రిటన్‌ పార్లమెంటుపై దాడికి యత్నించిన సంగతి తెలిసిందే.

ఉమర్ హక్ కూడా దీన్నే స్ఫూర్తిగా తీసుకున్నట్టు గుర్తించారు. తాను తయారుచేసిన 'డెత్ స్క్వాడ్' టీమ్ ను లండన్ కు రప్పించి.. ఇద్దరు వ్యక్తుల సహాయంతో విధ్వంసానికి పాల్పడటానికి వ్యూహ రచన చేశాడని నిర్దారించారు.

11-14ఏళ్ల విద్యార్థులను ఆకర్షించేలా..

11-14ఏళ్ల విద్యార్థులను ఆకర్షించేలా..

ఉగ్రదాడుల్లో భాగంగా కత్తులు, తుపాకులు, బాంబులు, భారీ కార్లతో ఉమర్ విధ్వంసానికి ప్లాన్ చేసినట్టు తేల్చారు. అతని వద్ద దొరికిన పలు పుస్తకాల్లోనూ వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలు దొరికాయి. సుదీర్ఘ లక్ష్యంతోనే ఉమర్ ఉగ్ర కార్యకలాపాల్లోకి దిగాడని, ఈ క్రమంలోనే 11-14ఏళ్ల విద్యార్థులకు సైతం ఉగ్ర శిక్షణ ఇస్తున్నాడని ధ్రువీకరించారు.

మదర్సాలో టీచర్‌గా

మదర్సాలో టీచర్‌గా

టీచర్‌గా కొనసాగే అర్హతలేవి లేకున్నా.. తూర్పు లండన్ లోని రెండు స్కూళ్లలో ఉమర్ ఐదేళ్లుగా పనిచేస్తున్నట్టు తేలింది. రిపుల్ రోడ్డులోని మదర్సాలో దాదాపు 250మంది విద్యార్థులకు టీచింగ్ చేస్తున్న అతను.. 110మంది విద్యార్థులను తన ఉగ్ర కార్యకలాపాల వైపు ఆకర్షించినట్టు గుర్తించారు. మదర్సాలో అతను ఇస్లామిక్ స్టడీస్ బోధించినట్టు నిర్దారించారు.

 మదర్సా విద్యార్థులకు బ్రెయిన్ వాష్..

మదర్సా విద్యార్థులకు బ్రెయిన్ వాష్..

విద్యార్థులను ఉగ్రవాదులుగా మార్చడానికి ఉమర్.. వాళ్లకు బాగానే బ్రెయిన్ వాష్ చేశాడని లండన్ కోర్టు ప్రాసిక్యూటర్ తెలిపారు.

హింసతో కూడిన వీడియోలను చూపించడం, తనతో పాటు చేయి కలపకపోతే మిమ్మల్ని కూడా ఇలాంటి దురదృష్టమే వెంటాడుతుందని వారికి చెప్పేవాడన్నారు. ప్రాణత్యాగం చేసి అమరులయ్యేందుకు సిద్దంగా ఉండాలని చిన్నారులతో ఒట్టు కూడా వేయించుకున్నాడన్నారు.

 రాబోయే ఆరేళ్లలో దాడికి స్కెచ్..

రాబోయే ఆరేళ్లలో దాడికి స్కెచ్..

ఉమర్ తమకు బ్రెయిన్ వాష్ చేసిన విషయాన్ని విద్యార్థులు కూడా అంగీకరించారు. దీనిపై స్పందించిన ఓ విద్యార్థి..'ఉమర్ మాకు ఎలా పోరాడాలో, ఎలా ధ్రుఢంగా తయారవాలో చెబుతున్నాడు. రాబోయే ఆరేళ్లలో లండన్ లో పెను విధ్వంసానికి అతను కుట్ర పన్నాడు. ఇందుకోసం 300మంది కూడిన ఆర్మీని తయారుచేయాలనుకున్నాడు.' అని చెప్పాడు.

English summary
A man who used his role as an unqualified teacher to try and recruit an "army" of children to commit terror attacks was convicted in a British court on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X