పాకిస్థాన్ లో భారీ భూకంపం.. ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు.. ఖురాన్ పఠనం
పాకిస్థాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై 5.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంపం ధాటికి పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తున్క్వా , పంజాబ్ రాష్ట్రాలు భూప్రకంపనలు వచ్చాయి. ఆఫ్గనిస్థాన్ లోని హిందూఖుష్ ప్రాంతంలో 102 కిలీమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతం అయినట్లు నేషనల్ సిస్మిక్ మానిటరింగ్ సెంటర్ పేర్కొంది. అలాగే భూప్రకంపనలు పాకిస్థాన్ సరిహద్దు దేశాలైన ఆఫ్గానిస్తాన్, తజకిస్థాన్ ప్రాంతాలకూ వ్యాప్తి చెందినట్లు సమాచారం అందించింది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్లనుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. రోడ్లపై కూర్చుని ఖురాన్ పఠించారు.
Earthquake jolts in Pakistan | High Alert Issued | People Scared | Lates... https://t.co/HvWc6zvmmK #Earthquake
— Hamid Hussain (@hhamid75) August 2, 2025
పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తున్క్వా , పంజాబ్ రాష్ట్రాల్లో శనివారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై 5.4 గా నమోదైంది. ఆఫ్గానిస్తాన్ లోని హిందూఖుష్ ప్రాంతంలో 102 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయినట్లు నేషనల్ సిస్మిక్ మానిటరింగ్ సెంటర్ తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం వాటిల్ల లేదని స్పష్టం చేసింది. ఖైబర్ పఖ్తున్క్వా రాష్ట్రంలోని పేషావర్, స్వాట్, మాలాఖండ్, నౌషేరా, చార్ సద్దా, కరక్, దిర్, మర్దాన్, మోహమంద్, షంగ్లా, హంగూ,స్వాబీ, హరిపుర్, అబ్బోట్టాబాద్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి.

అలాగే పంజాబ్ రాష్ట్రంలోని లాహోర్, రావల్ పిండీ, ఇస్లామాబాద్, అటోక్, టక్సిలా, ముర్రీ, సియాల్ కోట్, గుజ్రాన్ వాలా, గుజరాత్, షేక్ పురా, ఫిరోజ్ వాలా, మురిడ్ కే జిల్లాల్లోనూ భూ ప్రకంపనలు వ్యాప్తి చెందినట్లు నేషనల్ సిస్మిక్ మానిటరింగ్ సెంటర్ తెలిపింది. అలాగే భూప్రకంపనలు పాకిస్థాన్ సరిహద్దు దేశాలైన ఆఫ్గానిస్తాన్, తజకిస్థాన్ ప్రాంతాలకూ వ్యాప్తి చెందినట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications