ఆటోపైలట్: ఎంహెచ్370పై తాజా ట్విస్ట్, ఎక్కడ సూచిస్తే
కౌలాలంపూర్/సిడ్నీ: ఈ ఏడాది మార్చి 8వ తేదీన గల్లంతైన మలేషియా విమానం ఎంహెచ్ 370 పైన రోజుకో విషయం బయటకు వస్తోంది. తాజాగా మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఎంహెచ్ 370 విమానం సముద్రంలో క్రాష్ అయినప్పుడు అది ఆటో పైలట్‌లో ఉందట.

విమానం క్రాష్ అయినప్పుడు ఆటో పైలట్‌గా ఉందని ఆస్ట్రేలియా అధికారులు చెబుతున్నారు. కాగా, ఆస్ట్రేలియా రవాణా శాఖ మంత్రి వారెన్ ట్రస్ మాట్లాడుతూ... శాటిలైట్ తాజాగా సూచించిన స్థానంలో తాము గాలింపు చర్యలు చేపడతామని చెప్పారు.
ఆస్ట్రేలియా ట్రాన్సుపోర్ట్ సేఫ్టే బ్యూరో మార్టిన్ డొలాన్ మాట్లాడుతూ... విమానంలో ఫ్యూయల్ అయిపోయి క్రాష్ అయిన సమయంలో ఆటో పైలట్‌లో ఉన్నట్లుగా గట్టిగా నమ్ముతున్నామన్నారు. హిందూమహాసముద్రంలోనే అది పడిందన్నారు. కాగా విమానం కౌలాలంపూర్ నుండి బీజింగ్ వెళ్తుండగా గల్లంతయింది.












Click it and Unblock the Notifications