పట్టాలు తప్పిన కోల్‌కతా ఎక్స్‌ప్రెస్- పట్టాలపై చెల్లాచెదురుగా ఏడు బోగీలు

అస్సాంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. గువాహటి సమీపంలో ఈ తెల్లవారుజామున ఓ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. మొత్తం ఏడు బోగీలు చెల్లాచెదురు అయ్యాయి. ఈ ఘటనలు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇప్పటివరకు ఎంతమంది మరణించారనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రైల్వే అధికారులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

మిజోరం నుంచి కోల్‌కతా వెళ్తున్న సైరన్ ఎక్స్‌ప్రెస్ ఇది. మార్గమధ్యలో గువాహటి సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ వేకువ జామున సుమారు 6:50 గంటల సమయంలో దిగరు స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలింజిన్ తో పాటు మొత్తం ఏడు బోగీలు పట్టాల నుంచి పక్కకు జారిపోయాయి. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే రైలు బోగీల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అయ్యాయి.

Kolkata-Sairang Express derail near Guwahati Reports claimed several passengers were injured rescue

గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక కేకలు వేస్తూ బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. చీకటి సమయం కావడంతో ప్రారంభంలో సహాయక చర్యలకు కొంత జాప్యం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రైల్వే అధికారులు, రెస్క్యూ టీమ్‌లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను వెలుపలికి తీసుకొచ్చాయి. గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

హెచ్ 1బీ స్పాన్సర్‌షిప్‌ నిలిపివేసిన ఐబీఎం: అమెరికాను వీడటమో, రిజైన్ చేయడమో
హెచ్ 1బీ స్పాన్సర్‌షిప్‌ నిలిపివేసిన ఐబీఎం: అమెరికాను వీడటమో, రిజైన్ చేయడమో

ఈ ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియట్లేదు. రైల్వే అధికారులు దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా లేదా రైల్వే ట్రాక్‌లో ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలను పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో రైల్వే ఇంజినీర్లు, విచారణాధికారులు ట్రాక్ పరిస్థితులు, సిగ్నలింగ్ వ్యవస్థ, బ్రేకింగ్ సిస్టమ్ ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తోన్నారు. విచారణ పూర్తయిన తర్వాతే ప్రమాదానికి అసలు కారణం స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు.

ఏపీతో కృష్ణా జలాలపై తేల్చనున్న సుప్రీంకోర్టు- రేవంత్ రెడ్డి రివ్యూ
ఏపీతో కృష్ణా జలాలపై తేల్చనున్న సుప్రీంకోర్టు- రేవంత్ రెడ్డి రివ్యూ

దిగరు స్టేషన్ వద్ద మరొక రైలు వెళ్లడానికి సిగ్నల్ రావడంతో కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్ వేగాన్ని తగ్గించడానికి లోకో పైలట్ ప్రయత్నించారని, ఆ సమయంలో రైలు వేగం అదుపులోకి రాకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై నార్త్ ఫ్రాంటియర్ రైల్వే అధికారులు స్పందించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని సీపీఆర్‌ఓ కపింజల్ కిషోర్ శర్మ వెల్లడించారు.

కార్తీకమాసంలో తిరుపతి కపిలతీర్థంలో రూ. 500 లతో.. !!
కార్తీకమాసంలో తిరుపతి కపిలతీర్థంలో రూ. 500 లతో.. !!

ఈ ప్రమాదం వల్ల ఈ మార్గంలో పలు రైళ్ల రాకపోకలు ప్రభావితం అయ్యాయి. దిగరు స్టేషన్ సమీపంలో మెయిన్ రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఈ మార్గంలో వెళ్లాల్సిన పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించారు. దీనివల్ల పలు రైళ్లు నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా నడుస్తోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+