విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. ఈ లక్షణాలు ఉంటే డేంజర్ లో పడినట్టే..!
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ PJ.2.1 పలు దేశాల్లో వ్యాప్తి చెందుతోందని పరిశోధకులు గుర్తించారు. తొలిసారిగా ఈ వేరియంట్ ను మే 2026 లో కెనడాలోని ఒంటారియోలో గుర్తించారు. ఆ తర్వాత జూన్ 30న అమెరికాలోని న్యూయార్క్ లోనూ గుర్తించారు. ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న ఈ డేంజరస్ వేరియంట్ ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ ద్వీపాల్లో గణనీయంగా కేసులు పెరగడానికి కారణం అవుతోంది.
ఇక గత వేరియంట్లతో పోల్చితే ఇది మరింత తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుందని చెప్పేందుకు ప్రస్తుతానికి ఆధారాల్లేవని నిపుణులు పేర్కొన్నారు. అలాగే భారత్ లో ఈ వేరియంట్ కు సంబంధించిన కేసులు ఇప్పటివరకూ నమోదు కాలేదని తెలుస్తోంది. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ కు సాధారణ జలుబు లక్షణాలే కనిపిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని.. పరీక్షలు చేయించుకోవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచిస్తోంది.
అయితే జర్నల్ ఆఫ్ ఇన్ ఫెక్షన్ లో ఇటీవల పబ్లిష్ అయిన కథనం ప్రకారం ఈ కరోనా కొత్త వేరియంట్ స్పైక్ ప్రొటీన్ లో పలు మ్యుటేషన్లు జరిగాయని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. మానవ కణాల్లోకి చొచ్చుకెళ్లడానికి వైరస్ ఉపయోగించే ACE2 రిసెప్టర్ తో ఇది మరింతగా బంధాన్ని ఏర్పాటు చేసే లక్షణాన్ని కలిగి ఉందని.. దీనివల్ల ఇది వేగంగా వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈ కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు చూస్తే సాధారణంగా జలుబు, జ్వరం, ముక్కు కారడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, బలహీనంగా ఉండటం తదితర లక్షణాలు ఉంటాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే కొంత మందిలో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంది. మరోవైపు భారత్ లో ఇప్పటివరకూ ఈ కరోనా కొత్త వేరియంట్ PJ.2.1 ను గుర్తించలేదు.












Click it and Unblock the Notifications
