వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైడ్ ఎఫెక్ట్స్: వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్‌లో నొప్పి, జ్వరం.. అయినా తీసుకోవాలంటోన్న వాలంటీర్...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్స్ ప్రయోగ దశలో ఉన్నాయి. అయితే మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ స్వల్ప ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ఫ్యాక్స్ న్యూస్, స్నేహితులతో పంచుకన్నాడు. నార్త్ కరోలినా యూనివర్సిటీకి చెందిన విద్యార్థి మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్నారు. చాపెల్ హిల్‌కి చెందిన జాక్ మార్నింగ్ స్టార్.. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని వివరించారు.

తొలి టీకా తీసుకున్న తర్వాత శరీరంలో కొన్ని మార్పులు గమనించానని తెలిపారు. అలసటకు గురయ్యానని.. తర్వాత జ్వరం వచ్చిందని చెప్పారు. అలాగే ఇంజెక్షన్ తీసుకున్న చోట నొప్పి వచ్చిందని వెల్లడించారు. అయితే అతనికి రెండుసార్లు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. తర్వాత కోలుకున్నాడని ఫ్యాక్స్ న్యూస్ రిపోర్ట్ చేసింది. అయితే అతనికి అనారోగ్యంగా ఉన్నట్టు కనిపింలేదని ఫ్యాక్స్ రిపోర్ట్ చేయగా.. ప్రాణాలు కాపాడుకునేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలని విద్యార్థి పేర్కొనడం విశేషం.

Moderna trial volunteer experiences side effects including pain, fever

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇబ్బంది పడ్డ వాస్తవం అని మార్నింగ్ స్టార్ తెలిపారు. కానీ కొంచెం నొప్పి, జ్వరం వస్తుందని తెలిసీ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండేరు అని చెప్పారు. క్లినికల్ ట్రయల్ అయినా..వ్యాక్సిన్ అయినా మేలు చేస్తుందని తెలిపారు. ఇదీ తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడుతుంది అని చెప్పారు. కరోనా వైరస్ నుంచి సాధారణ స్థితికి తీసుకొస్తుందని వివరించారు.

ఫిజర్ వ్యాక్సిన్ 90 శాతం ప్రభావం చూపిస్తోంది. మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. భవిష్యత్‌లో మోడెర్నా కూడా అలానే వచ్చే ఛాన్స్ ఉంది. మోడెర్నా లాస్ట్ ట్రయల్‌లో 30 వేల మందిని పరిశీలించే అవకాశం ఉంది. దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రవేశించే నాటికి ప్రజలందరికీ కావాల్సిన ఇమ్యూనిటీ వస్తోందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా విశ్వాసం వ్యక్తం చేశారు.

English summary
student from University of North Carolina at Chapel Hill who volunteered for the Moderna coronavirus vaccine trial has shared his experience of getting a shot of the coronavirus vaccine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X