40 మంది సైనికులు, 10 మందికి పైగా పౌరులు మృతి: ఉక్రెయిన్
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. రెండో సారి బాంబుల వర్షం కొనసాగించింది. ఉక్రెయిన్ అన్ని నగరాలపై రష్యా దాడులను చేస్తోంది. ప్రధాన పట్టణాలను టార్గెట్ చేసుకుని రష్యా యుద్ధ విమానాలు బాంబుల దాడి చేస్తున్నాయి. 40 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారని.. యుక్రెయిన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. సైనికులతోపాటు పది మందికిపైగా సామాన్య పౌరులు చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహా దారు ఒలెస్కీ అరస్టో విజ్ ప్రకటించారు.

రెండు ఎయిర్ పోర్టులు స్వాధీనం
రెండు ఎయిర్ పోర్టులను ఇప్పటికే రష్యా సైన్యం ధ్వంసం చేసింది. రష్యా దాడులను యుక్రెయిన్ తిప్పికొడుతోంది. రష్యా యుద్ధ విమానాలను కూల్చేస్తామంటూ యుక్రెయిన్ ప్రభుత్వం వరుసగా ప్రకటిస్తోంది. మొత్తం 7 రష్యా యుద్ధ విమానాలను కూల్చివేశామని యుక్రెయిన్ ఆర్మీ తెలిపింది. మరో యుద్ధ విమానాన్ని నేల కూల్చామని ప్రకటించింది. మొత్తం 10 రష్యా యుద్ధ విమానాలను కూల్చివేశామని పేర్కొన్నారు. యుక్రెయిన్ భూభాగంలోకి చొరబడ్డ 50 మంది రష్యా సైనికులను తుదముట్టించామని యుక్రెయిన్ చెబుతోంది.

ప్రజలే టార్గెట్
సామాన్య పౌరులను రష్యా టార్గెట్ చేస్తోందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది. ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని ఆరోపిస్తోంది. రష్యా మాత్రం కేవలం సైనిక స్థావరాలపై మాత్రమే దాడులు చేస్తున్నామని చెబుతోంది. తమపై దాడులు మొదలు పెట్టిన రష్యాపై యుక్రెయిన్ అధ్యక్షుడు జలాన్ స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రష్యాతో అన్ని దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Recommended Video

జోక్యం చేసుకున్నారో ఇక అంతే
ఇటు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించేసింది. ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై రష్యా బాంబు దాడులకు పాల్పడుతోంది. యుద్ధం తమ ఉద్దేశం కాదని చెప్తూ వచ్చిన పుతిన్.. అకస్మాత్తుగా ఉక్రెయిన్‌పై దాడికి దిగారు. యుద్ధ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు పుతిన్ గట్టి హెచ్చరికలు కూడా చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బయటి దేశాలు జోక్యం చేసుకోవాలని చూస్తే.. చరిత్రలో మునుపెన్నడూ ఎదురుకాని తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. మీరు నా మాట వింటారని ఆశిస్తున్నట్లు ప్రపంచ దేశాలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం కోసం కాదని.. ఉక్రెయిన్‌ను సైనిక రహితం చేయడం కోసమేనని తెలిపారు.












Click it and Unblock the Notifications