వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రదాడి: భారత్ పైన ముషారఫ్ తీవ్ర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

కరాచి: భారత్ పైన పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీర్ లో ఎవరు దాడి చేసిన పాకిస్థాన్ నే బాధ్యులుగా చేయడం భారత్‌కు అలవాటైపోయిందన్నాడు. యూరీ సెక్టార్ లో దాడికి సంబంధించి తమపై భారత్ ఎలాంటి మిలిటరీ చర్యలు తీసుకున్నా ఎప్పుడంటే అప్పుడు పాక్ దాడులు చేయగలదని హెచ్చరించాడు.

ప్రస్తుత దాడులకు సంబంధించి భారత్ మిలటరీ యాక్షన్‌తో ప్రతీకారం తీల్చుకోవాల్సిందే అంటున్న డీజీఎంవో, డిఫెన్స్ మినిస్టర్... ఓసారి జరుగుతున్న పరిణామాలు ఏమిటో అర్థం చేసుకుంటే మంచిదన్నాడు. ఇప్పుడు భారత్ తమకు నచ్చిన చోటును ఎంపిక చేసుకొని దాడి చేస్తే, తాము కూడా మాకు నచ్చిన చోట, నచ్చిన సమయంలో దాడి చేస్తామన్నాడు.

Musharraf calls Bugti a terrorist, says Pak not involved in Uri attack

పాక్ ఆర్మీ సహాయంతోనే జైషే ఈ మహ్మద్ సంస్థ యూరీ స్థావరంపై దాడులకు దిగిందన్న భారత్ వ్యాఖ్యలను ఖండించాడు. అలాగే దాడి జరిగిన గంటల్లోనే పాక్ పై ఆరోపణలు చేసేందుకు భారత్ వద్ద ఏం ఆధారాలు ఉన్నాయో తనకు తెలియదన్నాడు. కాశ్మీర్‌లో దాడి జరిగిన ప్రతిసారి పాకిస్థాన్ ను నిందించడం భారత దేశానికి అలవాటయిందన్నాడు.

English summary
Musharraf calls Bugti a terrorist, says Pak not involved in Uri attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X