భారత్‌లో వ్యాపారాల్లేవ్: షరీఫ్ ఫ్యామిలీ, బెలూచిస్తాన్ గురించి మాట్లాడితే.. మోడీకి హెచ్చరిక
లాహోర్: భారత దేశంలో తమకు వ్యాపారాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసిన ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబ సభ్యులు కౌంటర్ ఇచ్చారు. తమకు భారత దేశంలో ఎలాంటి వ్యాపారాలు లేవని స్పష్టం చేశారు.
తాము ఎన్నిసార్లు ఈ విషయమై స్పష్టంగా చెబుతున్నా ఇమ్రాన్ ఖాన్ పదేపదే అవే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భారత్‌లోని వ్యాపారాల ద్వారా 2015లో నవాజ్ షరీఫ్ రూ.405 కోట్లు గడించారని, అక్కడ కొత్తగా రెండు చక్కెర కర్మాగారాలు ఏర్పాటు చేశారని ఇమ్రాన్ ఆరోపణలను కొట్టి పారేశారు.

మేం ఖలిస్తాన్ గురించి మాట్లాడుతాం: పాక్
భారత్ బెలూచిస్థాన్ గురించి మాట్లాడితే తాము ఖలిస్థాన్, నాగాలాండ్, అస్సాం, త్రిపుర, సిక్కిం, మావోయిస్టుల గురించి మాట్లాడవలసి ఉంటుందని, అయితే తాము ఆ పని చేయమని పాక్ ప్రధాని ప్రత్యేక దూతలు వ్యాఖ్యానించారు. భారత్ అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోవడం లేదన్నారు.
మీరు ఆట నిబంధనలు మార్చుతున్నారని, మేం కూడా దెబ్బకు దెబ్బ తీస్తామన్నారు. బెలూచిస్తాన్ గురించి భారత్ మాట్లాడటం వెంటనే మానివేయాలన్నారు. ప్రధాని మోడీ నియమాలు ఉల్లంఘిస్తున్నారన్నారు. కాగా, ఇటీవల మోడీ బెలూచిస్తాన్ గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications