వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరకొరియా మళ్లీ తెగించింది: మరో క్షిపణి ప్రయోగం, ట్రంప్ మాటను లెక్క చేయకుండా!

ఉత్తరకొరియా ప్రయోగించిన తాజా క్షిపణిని మీడియం రేంజ్ కేఎన్‌-17 బాలిస్టిక్‌ క్షిపణిగా గుర్తించినట్లు తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: ఉత్తరకొరియాతో సమస్యను సామరస్యకపూర్వకంగా పరిష్కరించుకోవాలని ట్రంప్ వ్యాఖ్యానించిన కొద్ది గంటలకే.. ఆ దేశం మరో క్షిపణి ప్రయోగం చేపట్టి దుందుడుకు చర్యకు పాల్పడింది.

మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. విషయాన్ని ధ్రువీకరించిన అమెరికా రక్షణ విభాగ కార్యాలయం పెంటగావ్.. ప్రయోగం మాత్రం విఫలమైందని పేర్కొనడం గమనార్హం.

ఉత్తరకొరియా ప్రయోగించిన క్షిపణి.. ఆ దేశ భూభాగాన్ని కూడా దాటలేకపోయిందని అమెరికా తెలిపింది. ఉత్తరకొరియా ప్రయోగించిన తాజా క్షిపణిని మీడియం రేంజ్ కేఎన్‌-17 బాలిస్టిక్‌ క్షిపణిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ దేశం ప్రయోగించిన ఈ క్షిపణితో ఉత్తర అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ అధికారులు వెల్లడించారు.

North Korea ballistic missile test fails, NBC News confirms

మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ.. ఉత్తరకొరియా దుందుడుకు చర్య చైనాను అగౌరవపరిచేలా ఉందన్నారు. ఈ చర్య ద్వారా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కూడా అమెరికా అవమానించిందని ట్రంప్ మండిపడ్డారు.

కాగా, క్షిపణి ప్రయోగాలను అడ్డుకునేందుకు చైనా అధ్యక్షుడు చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ ప్రశంసించిన రోజే.. ఉత్తరకొరియా మరో క్షిపణి ప్రయోగానికి సిద్దపడటం గమనార్హం.

English summary
File photo of Ballistic rocket is seen launching during a drill by the Hwasong artillery units of the KPA Strategic Force in this undated picture provided by KCNA in Pyongyang on July 21, 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X