మోడీని ప్రశ్నించిన నార్వే జర్నలిస్ట్ కు మెటా షాక్..!
భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల క్రితం యూరప్ టూర్ కు వెళ్లిన సందర్బంగా నార్వే రాజధాని ఓస్లోలో పర్యటించారు. అక్కడ నార్వే ప్రధానితో కలిసి సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నార్వేలో ఓ మహిళా జర్నలిస్ట్ హెల్లె లింగ్ (Helle lyng) కవరేజికి వచ్చారు. ఆమె ప్రధాని మోడీని ఓ ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించారు. అయితే ప్రధాని మోడీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. దీంతో ప్రపంచంలోనే మీడియా స్వేచ్ఛలో టాప్ లో ఉన్న దేశంలో జర్నలిస్టుల నుంచి ప్రశ్నలు కూడా ఎదుర్కోలేరా అంటూ ప్రశ్నించారు. దీంతో కేంద్రం కూడా స్పందించి వివరణ ఇచ్చింది.
అనంతరం రెండో రోజు ప్రధాని మోడీ పాల్గొన్న మరో కార్యక్రమానికి కూడా వచ్చిన జర్నలిస్ట్ హెల్లె లింగ్.. అక్కడికి వచ్చేందుకు తనకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాలేదని ట్వీట్ చేశారు. దీంతో అంతా సజావుగా సాగిపోతుందని, వివాదం ముగిసినట్లేనని అంతా భావించారు. కానీ తెరవెనుక ఏం జరిగిందో తెలియదు కానీ మోడీని ప్రశ్నించిన జర్నలిస్ట్ ఇన్ స్టా, ఫేస్ బుక్ ఖాతాల్ని మెటా సస్పెండ్ చేసింది. తద్వారా ప్రధాని మోడీ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాక ఆమె వేస్తున్న ప్రశ్నలకు వస్తున్న స్పందనకు కూడా అడ్డుకట్ట పడింది.

If you’re trying to reach me on Instagram or Facebook, I would like to let you know I have been suspended from both accounts. I have wanted to respond to as many Indians as possible, but my responses will now be delayed. I hope I will get my accounts back. @Meta
— Helle Lyng (@HelleLyngSvends) May 19, 2026
దీనిపై హెల్లె లింగ్ ఎక్స్ లో స్పందించింది. "మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్‌లో సంప్రదించడానికి ప్రయత్నిస్తుంటే, ఆ రెండు ఖాతాల నుండి నన్ను సస్పెండ్ చేశారని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను వీలైనంత ఎక్కువ మంది భారతీయులకు స్పందించాలనుకున్నాను, కానీ ఇప్పుడు నా స్పందనలు ఆలస్యం అవుతాయి. నా ఖాతాలు నాకు తిరిగి వస్తాయని ఆశిస్తున్నాను." అంటూ ఆమె వెల్లడించారు. తన ట్వీట్ కు మెటాను ట్యాగ్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications