భారత్ కు పుతిన్ ఎంట్రీ ఫిక్స్.. ట్రంప్ కు దబిడి దిబిడే..!
భారత్ పై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపాలంటే రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని భావించిన ట్రంప్ ఈ మేరకు పుతిన్ మిత్ర దేశాలపై కన్నెర్ర చేస్తున్నారు. అందులో భాగంగానే రష్యా నుంచి చమురు, ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న భారత్ పై ట్రంప్ భారీగా సుంకాలను పెంచారు. ఈ క్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం అయ్యారు. ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న దోభాల్.. ఈమేరకు పుతిన్ తో భేటీ అయ్యారు.
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధించిన సమయంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య ఎనర్జీ, రక్షణ రంగాలపై చర్చించారు. ఓ వైపు భారత్, రష్యాలపై ట్రంప్ కారాలు మిరియాలు నూరుతుంటే ఈ భేటీ జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే భారత్ పై 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్.. అంతే దూకుడుగా రష్యాకు అల్టిమేటం జారీ చేశారు. ఉక్రెయిన్ తో యుద్ధం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని.. రష్యాపైన భారీ స్థాయిలో టారిఫ్ లు విధిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో ఈ భేటీ ఎంతో ప్రాధాన్యతను చాటుకుందని చెప్పవచ్చు.
Doval meets Putin in Moscow: India's NSA Ajit Doval meets Russian President, Putin slated to visit India soon@Mohammed11Saleh reports pic.twitter.com/A76bIhhdfx
— WION (@WIONews) August 7, 2025
మరోవైపు పుతిన్ భారత పర్యటనకు రానున్నట్లు, సంబంధిత తేదీలు ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో పుతిన్ భారత్ కు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత వస్తువులపై ట్రంప్ 50శాతం టారిఫ్ లు విధించడం వెనుక ఎటువంటి లాజిక్ లేదా కారణం లేదని భారత సీనియర్ దౌత్యవేత్త దమ్ము రవి స్పష్టం చేశారు. టారిఫ్ లు విధించిన తర్వాత కూడా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని విదేశాంగశాఖ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఆయన తెలిపారు. ఇరు దేశాల వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం ఆగస్టు చివరి వారంలో భారత్ ను సందర్శించే అవకాశం ఉందన్నారు.

మరోవైపు భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ లు విధించడంపై ప్రధాని మోదీ స్పందించారు. రైతుల ప్రయోజనాల కోసం ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రైతుల సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమని అమెరికాను ఉద్దేశిస్తూ తెలిపారు. భారత ప్రభుత్వం.. రైతులు, మత్స్యకారులు, పాడిరైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎప్పటికీ రాజీపడబోదన్నారు.












Click it and Unblock the Notifications