నేపాల్‌లో కుప్పకూలిన ప్రభుత్వం... విశ్వాస పరీక్షలో నెగ్గని కేపీ శర్మ ఓలీ...
నేపాల్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం చివరకు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. నేపాల్ పార్లమెంటులో సోమవారం(మే 10) జరిగిన విశ్వాస పరీక్షలో ఓలీ ఓటమిపాలయ్యారు. ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు ఆయనకు 136 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా కేవలం 93 మంది మాత్రమే మద్దతు పలికారు. నేపాల్ పార్లమెంటులో మొత్తం 275 మంది సభ్యులు ఉండగా ఇందులో నలుగురు సస్పెన్షన్‌లో ఉన్నారు. దీంతో 271 మంది సభ్యులను పరిగణలోకి తీసుకోగా ఆయనకు 136 మంది సభ్యుల మద్దతు అవసరమైంది.
విశ్వాస పరీక్ష నేపథ్యంలో కేపీ శర్మ ఓలీ నేత్రుత్వంలోని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ విప్ జారీ చేసింది. అయినప్పటికీ 28 మంది సొంత పార్టీ నేతలు ఓటింగ్‌కి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ విప్ ఉల్లంఘణతో వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కాగా,2017లో జరిగిన ఎన్నికల్లో కేపీ ఓలీ శర్మ నేత్రుత్వంలోని సీపీఎన్ యూఎంఎల్, పుష్ప కమల్ దహల్ ప్రచండ నేత్రుత్వంలోని సీపీఎన్ మావోయిస్ట్ సెంటర్‌లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రెండు పార్టీలు విలీనమై నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(సీపీఎన్)గా ఏర్పడ్డాయి. అయితే ఆ తర్వాత రెండేళ్లకే పార్టీలో చీలిక తప్పలేదు.

ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలీకి పార్టీ బాధ్యతలు చూసుకుంటున్న ప్రచండకు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం కొరవడిందని ప్రచండ బహిరంగంగానే ఆరోపణలు చేశారు. కేపీ శర్మ ఓలీపై అవినీతి ఆరోపణలు కూడా చేశారు. కానీ ఆ తర్వాత వివాదాలు సద్దుమణిగినట్లే కనిపించినప్పటికీ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గతవారం ప్రచండ వర్గం ప్రధానికి తమ మద్దతును ఉపసంహరించుకుంది. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వ విధానాలు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దంగా ఉన్నాయని.. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఆరోపిస్తూ తమ మద్దతును విరమించుకుంది.
ఈ నేపథ్యంలో తాజాగా పార్లమెంటులో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కేపీ ఓలీ తగిన మద్దతు లేక ప్రభుత్వం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇది అత్యంత దురదృష్టకరమని.. దేశ ప్రజల కోసం నిరంతరం పనిచేసిన ప్రభుత్వాన్ని ఇలా సాగనంపడం సరికాదని ఈ సందర్భంగా ఓలీ అభిప్రాయపడ్డారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications