వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వేరియంట్ బీ1.617.2పై ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రెజెనికా వ్యాక్సిన్ 80 శాతం సమర్థవంతం: యూకే స్టడీ

|
Google Oneindia TeluguNews

లండన్: ఆస్ట్రాజెనికా-ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్-19 కొత్త వేరియంట్ బీ1.617.2పై 80 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్(పీహెచ్ఈ) తన అధ్యయనంలో తేల్చింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(పుణె)తో కలిసి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనికా సంయుక్తంగా కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే.

Recommended Video

Black Fungus కంటే ప్రమాదకరం White Fungus, Oxygen నిర్లక్ష్యం | Who Are At Risk?| Oneindia Telugu

కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు ఇవ్వడం వల్ల ప్రాణాంతక కరోనావైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తాజా యూకే అధ్యయనం తేల్చింది. అంతేగాక, ఈ వ్యాక్సిన్ రెండు డోసులుగా తీసుకోవడం ద్వారా బీ.117 వేరియంట్‌పై 87 శాతం రక్షణ ఉంటుందని తెలిపింది. దీనిని ఇంగ్లాండ్ లోని కెంట్ ప్రాంతంలో ముందుగా కనుగొన్నారు. కాగా, ఈ విషయాన్ిన ది టెలిగ్రాఫ్ న్యూస్ పేపర్ వెల్లడించింది.

 Oxford-AstraZeneca Vaccine 80% Effective Against B1.617.2 Variant: UK Study

కాగా, గత వారం రోజులుగా బీ1.617.2 కరోనా రకం కారణంగా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. వారం వారం వస్తున్న రిపోర్టులను బట్టి ఈ విషయం స్పష్టమైందని కరోనా జెనమోమిక్స్ డైరెక్టర్ డాక్టర్ జెఫ్రె బారెట్ తెలిపారు. కెంట్ వేరియంట్ కంటే ఇది 20-30శాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని వెల్లడించారు.

ఇండియాలో తొలిసారి గుర్తించినట్లుగా చెప్పున్న వేరియంట్ ఇంగ్లాండ్ లో ఎక్కువగా వ్యాప్తి జరుగుతోందని నేషనల్ హెల్త్ సర్వీస్ వ్యాక్సిన్ ప్రోగ్రాంను ప్రకటించింది. కమ్యూనిటీల మధ్య వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందనే వ్యాక్సినేషన్ త్వరగా చేపట్టాలని భావించారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ సమర్థత కనబర్చడంతో వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచనున్నట్లు పేర్కొన్నారు.

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్.. సీరమ్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మనదేశంలో కోవాగ్జిన్ తోపాటు కోవిషీల్డ్ టీకాను ఇస్తున్నారు. భారత్, యూకే, ఇతర దేశాల్లోనూ కోవిషీల్డ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మనదేశంలో వ్యాక్సిన్ కొరత దృష్ట్యా.. అధికభాగం వ్యాక్సిన్లను మనదేశంలోనే అందుబాటులో ఉంచుతామని సీరమ్ అధినేత ఆదర్ పూనావాలా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
Two doses from either the Oxford-AstraZeneca or the Pfizer vaccine are over 80 per cent effective in preventing infection from the B1.617.2 variant of Covid-19, first discovered in India, a new UK government study has reportedly found.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X