జగన్ ది నిజంగా లక్కీ హ్యాండ్?
తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. 210కు పైగా స్థానాల నుంచి అందిన తాజా ట్రెండ్స్ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ తర్వాత, ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రస్తుతం వేగంగా సాగుతోంది. ప్రారంభం విజయ్ స్థాపించిన తమిళన వెట్రి కజగం పార్టీ దూకుడు కనిపించింది. దీర్ఘకాలంగా తమిళనాట పాతుకుపోయిన రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. ఏఐఏడీఎంకేదీ అదే పరిస్థితి.
ఈ ఎన్నికల్లో అతి పెద్ద సంచలనం.. టీవీకే అద్భుతమైన ప్రదర్శన కనపర్చడం. ఈ ఎన్నికలతోనే అరంగేట్రం చేసిన టీవీకే 100 కు పైగా స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. ఏఐఏడీఎంకే రెండు, డీఎంకే మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక్కడ హంగ్ తప్పకపోవచ్చు. ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 సీట్ల మెజారిటీ వచ్చే అవకాశాలు ప్రస్తుతానికి లేనట్టే. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది టీవీకే. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోండటంతో సీట్ల సంఖ్య మరింత పెరగొచ్చు.

ఈ ట్రెండ్స్ తమిళనాడు రాజకీయ సమీకరణాలను నాటకీయంగా మార్చివేస్తున్నాయి. విజయ్ స్వతహాగా కింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పార్టీ చూపిన అనూహ్య ప్రభంజనం, ఇతర పార్టీల మద్దతుతో కలిసి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించగలరు. బీజేపీకి దూరంగా ఉంటూ వస్తోన్నందున విజయ్.. డీఎంకే వైపే మొగ్గు చూపే అవకాశాలు కొట్టిపారేయట్లేదెవరూ. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలే ఆయనకు మెజారిటీ సీట్లను అందించాయనేది సుస్పష్టం.
ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. జగన్ ను విజయ్ కలిసిన పొటోలు అవి. ఇదివరకు చెన్నైలో జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు అనిల్ రెడ్డి కుటుంబంలో జరుగుతున్న వివాహ వేడుకలో జగన్, విజయ్ కలిసిన విషయం తెలిసిందే. అనిల్ రెడ్డి కుమారుడు సాహిల్- వేదిక వివాహ సమయంలో వారిద్దరూ కలిశారు.
ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వైఎస్ జగన్ తో కలిసి దిగిన ఈ ఫొటోలను ఒక దశలో ఎన్నికల ప్రచార సమయంలో బహిరంగంగా విజయ్ ప్రదర్శించిన వీడియోలు కూడా దీనికి తోడయ్యాయి. ఈ ఎన్నికల్లో విజయ్ విజయం సాధించడం అటు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో జోష్ నింపింది. విజయ్ కు బెస్టాఫ్ లక్ చెబుతున్నారు వైఎస్ఆర్సీపీ అభిమానులు. సరిగ్గా ఎన్నికల ప్రచార సమయంలో జగన్ ను విజయ్ కలుసుకోవడంతో ఆయనను వైసీపీ అభిమానులు ఓన్ చేసుకున్నట్టయిందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం.












Click it and Unblock the Notifications