పవన్ కళ్యాణ్.. విజయ్‌ని చూసి నేర్చుకో.. సోషల్ మీడియాలో ట్రోల్స్ !!
తమిళనాడు రాజకీయాల్లో ఈసారి చరిత్రాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. గత ఐదు దశాబ్దాలుగా Dravida Munnetra Kazhagam - All India Anna Dravida Munnetra Kazhagam మధ్యే సాగిన ద్విముఖ పోరుకు ఈ ఎన్నికలు బ్రేక్ వేస్తున్నాయి. నటుడు Vijay రాజకీయ ప్రవేశంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. తాజా ట్రెండ్స్ ప్రకారం ఆయన పార్టీ Tamilaga Vettri Kazhagam అద్భుత ప్రదర్శన చేస్తూ ముందంజలో నిలవడం సంచలనంగా మారింది.
234 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 స్థానాలు అవసరం. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ ప్రకారం, విజయ్ పార్టీ వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. Edappadi K. Palaniswami నేతృత్వంలోని అన్నాడీఎంకే కూటమి రెండవ స్థానంలో ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి M. K. Stalin నేతృత్వంలోని డీఎంకే కేవలం మూడో స్థానంలో కొనసాగుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

కాగా స్టార్ హీరోగా ఉన్న విజయ్.. తమిళనాట రజినీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా ఎదిగారు. ప్రస్తుతం టాప్ లో ఉన్నప్పటికీ.. అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గ్రౌండ్ లెవల్‌లో పని చేయడం, యువతను ఆకర్షించడం, స్పష్టమైన అజెండాతో ముందుకు రావడం.. ఇలా అన్నీ కలిసి ఆయనకు ఈ స్థాయి సపోర్ట్ తెచ్చిపెట్టాయని విశ్లేషకులు చెబుతున్నారు. సినిమాల ద్వారా సంపాదించిన భారీ ఫ్యాన్‌బేస్‌ను ఓటు బ్యాంక్‌గా మార్చడంలో విజయ్ సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది.
ఇక ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా చర్చకు దారితీశాయి. ముఖ్యంగా Pawan Kalyanతో విజయ్‌ను పోలుస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్లు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా Jana Sena Partyను స్థాపించి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, ప్రారంభ దశలో ఆయనకు ఆశించిన స్థాయి ఫలితాలు రాలేదు. 2019 ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, బీఎస్పీ వంటి పార్టీలతో కలిసి పోటీ చేసినప్పటికీ జనసేనకు గణనీయమైన ఫలితాలు దక్కలేదు. స్వయంగా పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరంలలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అలానే 2024లో కూడా ముందుగా బీజేపీ, తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఎదిగారు.
కానీ విజయ్ ప్రస్తుత ప్రదర్శనతో పోలిస్తే, "విజయ్ సింగిల్‌గా వచ్చి ఇంత ప్రభావం చూపితే, పవన్ ఎందుకు అలాంటి ప్రభావం చూపలేకపోయారు?" అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కొందరు విజయ్‌ను పొగుడుతుండగా, మరికొందరు పవన్‌పై ట్రోల్స్ చేస్తున్నారు.
TVKVijay Leading 🔥🔥🔥 pic.twitter.com/PgSmhP72Cd
— FOR 🅰 REASON (@f_AR_in_x) May 4, 2026
Once @TVKVijayHQ crosses 6% Vote Share….
— Ramlal Bharath (@rj_4_all) May 4, 2026
Whole Telugu Twitter With One Fan Base 👇🏻 pic.twitter.com/bEjMZopAaM
Thank You @ysjagan sir 🙏❤pic.twitter.com/5IfOhFOUce https://t.co/VGaSpLaxY4
— KERALA VIJAY FANS CLUB (@KVFC_Official) May 3, 2026
Never Slept on roads
— CB ™ 🗡️ (@GOAT_078) May 4, 2026
Never licked others feet
Never used religion for votes
Never used women card
Never married 3tyms
Never used caste for votes
Never merged with the one who scolded their mother
LEADER @TVKVijayHQ 🔥 pic.twitter.com/OYbPDEl8dB
Pawan Kalyan watching TN election results #electionresult2026 pic.twitter.com/adZ3uwUfxw
— Radoo (@Ungamma_ra) May 4, 2026
నువ్వు just MLA గా గెలువు సామి
— RajuRaguTeja🧢 (@RajuRteja) May 4, 2026
ఇక్కడ ఒక బానిస కుక్క సిగ్గుతో చచ్చిపోతాది. pic.twitter.com/Qqun75MP78












Click it and Unblock the Notifications