వాస్తు ప్రకారం అద్దె ఇంట్లో ఉండేవారు సొంత ఇల్లు కొనుగోలు చేయాలంటే ఏం చేయాలి?

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అద్దె ఇంట్లో ఉంటూనే సొంత ఇంటి నిర్మాణానికి మార్గం సుగమం చేసుకోవడానికి వాస్తు శాస్త్రం కొన్ని సూచనలు అందిస్తోంది. మీ సంకల్పం నెరవేరడానికి కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. అలాగే నిరంతరం కష్టపడుతుండాలి. ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. పొదుపు చేయాలి. వాటికి ఈ మార్పులు తోడై సొంతింటి కల నెరవేరుతుంది.

ఈశాన్య మూల

వాస్తు ప్రకారం ఈశాన్య భాగం చాలా పవిత్రమైనది. అద్దె ఇంట్లో మీరు ఉండే గదిలో ఈశాన్య మూలను ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉంచుకోండి. అక్కడ ఒక గిన్నెలో నీరు పోసి ఉంచడం లేదా చిన్న దేవుడి విగ్రహం పెట్టుకోవడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది.

vastu tips According to the principles what steps should tenants take if they wish to purchase their own home

వాయువ్య మూల

సొంతిల్లు కట్టుకోవాలనే కోరిక త్వరగా నెరవేరాలంటే, భూమికి సంబంధించిన పత్రాలు లేదా కొత్త ఇంటి ప్లాన్ వంటివి ఉంటే వాటిని వాయువ్య గదిలో ఉంచండి. ఇది మార్పును, గమనాన్ని సూచిస్తుంది కాబట్టి మీ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి.

నైరుతి మూల

మీరు అద్దె ఇంట్లో పడుకునేటప్పుడు మీ తల దక్షిణ దిశలో ఉండేలా చూసుకోండి. నైరుతి భాగం స్థిరత్వానికి చిహ్నం. ఈ మూలలో బరువైన వస్తువులు ఉంచడం వల్ల ఆర్థిక స్థిరత్వం చేకూరుతుంది.

కొన్ని చిన్న చిట్కాలు

ఇంటి ఈశాన్యంలో ఒక చిన్న మట్టి పాత్రలో నీరు పోసి ఉంచండి. మట్టి (భూమి) తత్వంతో సంబంధం ఏర్పడితే సొంత స్థలం కొనే అవకాశాలు మెరుగుపడతాయని నమ్మకం. ప్రతిరోజూ పక్షులకు ధాన్యం లేదా నీరు పెట్టడం వల్ల జాతకంలోని దోషాలు తొలగి, కొత్త కార్యాలు ప్రారంభమవుతాయి. వీలైనప్పుడు ఆవుకు బెల్లం లేదా గడ్డి తినిపించడం శుభప్రదం. అద్దె ఇంట్లో ఉన్నప్పటికీ, "నేను త్వరలోనే నా సొంత ఇంట్లోకి వెళ్తున్నాను" అనే ధృడమైన ఆలోచనతో ఉండండి. ఇంటి ఈశాన్యంలో ఒక తెల్లటి కాగితంపై మీ కలల ఇంటి గురించి రాసి ఉంచండి. సరైన ఆర్థిక ప్రణాళిక, కష్టపడే తత్వం మీ లక్ష్యాన్ని త్వరగా చేరువ చేస్తాయి. మీకు ఇష్టమైన దైవాన్ని స్మరిస్తూ మీ ప్రయత్నాలు కొనసాగించండి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+