పాక్ పై మరోసారి మెరుపుదాడి! సిద్ధమైన అమెరికా సేనలు, ఆఖరు క్షణంలో విరమణ..

పాకిస్తాన్ పై మరోసారి‘ఆపరేషన్ లాడెన్’ తరహా దాడి జరపాలని అమెరికా సేనలు భావించాయి. అయితే ఆఖరు క్షణంలో పాక్ తగిన చర్య తీసుకోవడంతో అమెరికా ఈ దాడిని విరమించుకున్నట్లు సమాచారం.

వాషింగ్టన్: ఇస్లామిక్ ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చి కాపాడుతున్న పాకిస్తాన్ పై మరోసారి'ఆపరేషన్ లాడెన్' తరహా దాడి జరపాలని అమెరికా సేనలు భావించాయి. అయితే ఆఖరు క్షణంలో పాక్ తగిన చర్య తీసుకోవడంతో అమెరికా ఈ దాడిని విరమించుకున్నట్లు సమాచారం.

అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చేందుకు 2011లో పాకిస్తాన్ లో అమెరికా నేవీ సీల్ కమాండోలు దాడి చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ అమెరికా ఇలాంటి మెరుపుదాడి మళ్లీ జరిపితే అది పాకిస్తాన్ కు మరో మాయని మచ్చగా మిగిలిపోయేది.

Pakistan acted on hostages under US threat of bin Laden-style raid

అసలేం జరిగిందంటే... అమెరికా దేశస్థురాలు కైత్లాన్ కోల్ మన్(31), కెనడా జాతీయుడైన ఆమె భర్త జాషువా బాయ్లే(34)ను పాకిస్తాన్ లోని హక్కానీ గ్రూప్ ఉగ్రవాదులు అపహరించి ఐదేళ్లపాటు నిర్బంధించారు.

కైత్లాన్ కుటుంబాన్ని కాపాడాలంటూ అమెరికా ఎన్నోమార్లు కోరినా పాక్ కుంటిసాకులు చెబుతూ వచ్చింది. కొన్ని వారాల క్రితం హక్కానీ ఉగ్రవాదులు కైత్లాన్ కుటుంబాన్ని పాక్ లోనే మరో ప్రాంతానికి తరలిస్తుండగా అమెరికా నిఘా డ్రోన్ పసిగట్టింది.

దీంతో అమెరికన్ సేనలు అప్రమత్తమయ్యాయి. పాక్ మాటలు అబద్ధాలని తేలిపోవడంతో లాడన్ ను మట్టుబెట్టడానికి జరిపిన మెరుపు దాడి తరహాలోనే మరోసారి నేవీ సీల్ కమాండోలతో ఆపరేషన్ నిర్వహించాలని నిర్ణయించాయి.

ఈ మెరుపుదాడి కోసం ఆరుగురు కమాండోలను సైతం ఎంపిక చేశారు. విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కూడా తెలియజేశారు. కానీ ఆఖరు క్షణంలో ఈ దాడిని విరమించుకున్నారు.

నిఘా డ్రోన్ ద్వారా సేకరించిన సమాచారాన్ని అందజేసి.. వెంటనే కైత్లాన్ కుటుంబాన్ని తక్షణమే విడిపించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని పాకిస్తాన్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడంతో పాక్ దిగివచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+