టెర్రరిజం అనేది "చట్టబద్ధమైన పోరాటం".. భారత్ ను విడిచిపెట్టం.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వార్నింగ్
టెర్రరిజం ను "చట్టబద్ధమైన పోరాటం" గా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అభివర్ణించారు. పాకిస్థాన్ పై భారత్ దాడులకు పాల్పడుతోందని మరోసారి నోరు పారేసుకున్నారు. ఇలానే కొనసాగితే భారత్ ను విడిచిపెట్టేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. భారత్ ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందని.. పాకిస్థాన్ మాత్రం ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడుతోందని విమర్శలు చేశారు. అంతేకాక భారత్ చేతిలో హతం అయిన టెర్రరిస్టులను అమరవీరులుగా అభివర్ణించారు మునీర్.
ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచి పోషిస్తుందన్న పచ్చి నిజం మరోసారి బట్టబయలు అయింది. కరాచీలోని నేవల్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టెర్రరిజం ను "చట్టబద్ధమైన పోరాటం" గా అభివర్ణించారు. అంతేకాక భారత్ చేతిలో హతం అయిన టెర్రరిస్టులను అమరవీరులుగా అభివర్ణించారు మునీర్. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
జూన్ 28 శనివారం రోజు వజీరిస్థాన్ లో జరిగిన ఆత్మాహుతి దాడి వెనక భారత్ హస్తం ఉందని అసిమ్ మునీర్ నోరు పారేసుకున్నారు. భారత్ ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతుందని పాకిస్థాన్ మాత్రం ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడుతోందని నోటికొచ్చింది మాట్లాడారు. అయితే పాకిస్థాన్ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అవన్నీ తప్పుడు, నిరాధారమైన ఆరోపణలని తేల్చేసింది. ఈ మేరకు భారత విదేశాంగశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.
ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు చేయకుండానే పాకిస్థాన్ పై భారత్ రెండుసార్లు దాడులకు పాల్పడిందని పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ కనుక మరోసారి పాక్ పై దాడి చేస్తే తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని వివరించారు. భారత్ ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందన్నారు. అయితే పాకిస్థాన్ మాత్రం ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడుతోందని అన్నారు.

వజీరిస్థాన్ లో జరిగిన ఆత్మాహుతి దాడికి భారత్ కారణం అంటూ అసిమ్ మునీర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సూసైడ్ ఎటాక్ వెనుక భారత్ హస్తం ఉందన్నారు. అయితే మునీర్ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పాకిస్థాన్ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు భారత విదేశాంగశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.
జూన్ 28న దాదాపు 800 కిలోలు ఉన్న భారీ పేలుడు పదార్థాలతో ఓ వాహనం వజీరిస్థాన్ లోని ఓ ఉగ్రవాది సైనిక కాన్వాయ్ ను ఢీ కొట్టింది. ఈ దాడిలో 13 మంది పాక్ సైనికులు మృతి చెందారు. మరో 24 మందికి తీవ్రగాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications