మిస్సైళ్లను సిద్ధం చేసిన పాకిస్తాన్- సైన్యం తరలింపు: నిశితంగా గమనిస్తోన్న కేంద్రం

Pakistan missile test: జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రవాదుల కిరాతక దాడి తరువాత అనూహ్య పరిణామలు ఏర్పడుతున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన భద్రత వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ ఈ నిర్ణయాలను తీసుకుంది. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను తక్షణమే మూసివేసింది. చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లతో భారత్‌కు వచ్చిన, ఇక్కడ నివసిస్తోన్న పాకిస్తానీయులు కూడా తమ స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించే అవకాశాలు ఉండకపోవచ్చు.

Pakistan carry out a missile test at Karachi coast on April 24-25

దీనికి కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. మే 1 తేదీ లోపలే వాళ్లంతా కూడా భారత్‌ను వదిలి పాకిస్తాన్‌కు వెళ్లి పోవాల్సి ఉంటుంది. ఈ రాకపోకల కోసం వారికి అందుబాటులో ఉన్న ఒకే ఒక్కటి ఈ అట్టారీ బోర్డర్ చెక్‌పోస్ట్. దీని ద్వారా మాత్రమే అధికారికంగా సరిహద్దు దాటాల్సి ఉంటుంది. గడువు దాటిన తరువాత కూడా ఇక్కడే ఉండే పాకిస్తానీయులకు జైలు శిక్ష తప్పకపోవచ్చు.

ఇండస్ రివర్ ట్రీటీనీ కేంద్రం రద్దు చేసింది. పాకిస్తాన్‌తో అన్ని రకాల సంబంధాలను కూడా తెంచేసుకుంది. భారత్‌లో ఉన్న పాకిస్తాన్ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. మే 1వ తేదీ లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. సీసీఎస్‌లో తీసుకున్న నిర్ణాయలతో కూడిన అధికారిక పత్రాన్ని ఆయనకు అందజేసింది.

అటు పాకిస్తాన్‌లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. పహల్గామ్ దాడి జరిగినప్పటి నుంచి ఆ దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పానిక్ క్రియేట్ అయింది. భారత్ తీసుకున్న నిర్ణయాలను ఎలా తిప్పి కొట్టాలనే విషయంపై అక్కడి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.

అదే సమయంలో మిస్సైల్ పరీక్షలకు దిగింది పాకిస్తాన్. నేడు, రేపు ఉపరితలం నుంచి ఉపరితలం క్షిపణులను పరీక్షించబోతోంది. కరాచీ తీర ప్రాంతంలో మిస్సైల్ టెస్టులను చేపట్టింది. రెండు రోజుల పాటు ఇవి కొనసాగుతాయని వెల్లడించింది. తీరాన్ని పంచుకుంటోన్నందున భారత్‌కూ ఈ సమాచారాన్ని అందించింది. దీనికి తగ్గ నౌకాదళ సిబ్బంది, సైన్యాన్ని మోహరింపజేసినట్లు పేర్కొంది. ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్‌లో ఈ టెస్టులు ఉంటాయని వివరించింది.

అరేబియా, గల్ఫ్ ఆఫ్ ఒమన్ సముద్ర తీరాలను కలిగివుంది పాకిస్తాన్. మొత్తం 1,046 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందా దేశానికి. ఇందులో సింధ్ కోస్ట్- 270, మక్రాన్ కోస్ట్- 720 కిలోమీటర్లు. ఇండస్ డెల్టా రీజియన్ 150 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో అరేబియా తీరంలో క్షిపణి పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.

దీనిపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోన్నామని తెలిపింది. క్షిపణి పరీక్షలపై నిఘా ఉంచామని, వాటి అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తోన్నామని వివరించింది. మిస్సైల్ టెస్టుల సందర్భంగా ఎలాంటి ఉల్లంఘనలనైనా సహించబోమని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+