125,250 గ్రాముల అణు బాంబులు విసురుతాం.. పాకిస్థాన్ రైల్వే మంత్రి
పాకిస్థాన్ రైల్వే మంత్రి రశీద్ మరోసారి భారత యుద్దంపై అవాకులు చవాకులు పేలాడు. భారత దేశంలో యుద్దానికి సిద్దంగా ఉన్నామని చెప్పిన ఆయన యుద్దంలో లక్ష్యాలను చేధించేందుకు భారత్ పై ఆటంబాంబులు విసురుతామని అన్నారు. ఇందుకోసం 125,250 గ్రాముల ఆటం బాంబులు పాకిస్థాన్ వద్ద ఉన్నాయని అన్నారు.

మోడీ సిద్దంగా ఉండాలి
కొద్ది రోజుల క్రితం భారత్‌తో యుద్దం చేస్తామని ,అది కూడ ఆక్టోబర్ లేదా నవంబర్‌లో ఉంటుందని ప్రకటించిన పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రశీద్ మరోసారి యుద్ద ఘంటికలు మ్రోగించాడు. ఈనేపథ్యంలోనే పాకిస్థాన్‌లో అభివృద్ది పనులను సమీక్షించిన మంత్రి మరోసారి యుద్దం అంటూ హెచ్చరించాడు. ఇందుకోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ సిద్దంగా ఉండాలని హెచ్చరించాడు. మోడీ ఎలాంటీ పరిస్థితులనైన ఎదుర్కోవాలని అన్నాడు.

అణుబాంబులు విసురుతామన్న పాకిస్థాన్ మంత్రి
ఇందులో భాగంగానే తమవద్ద యుద్దంలో లక్ష్యాలను చేధించేదుకు అణుబాంబులు ఉన్నాయని చెప్పాడు. ముఖ్యంగా పాకిస్థాన్ 125, మరియు 250 గ్రాముల అణ్వాయుధాలు ఉన్నట్టు మంత్రి చెప్పాడు. గత రోజుక్రితమే రెండు అణ్వాయుధాలు కల్గిన దేశాలు యుద్దానికి వెళతారని పరోక్షంగా పాకిస్థాన్ ,ఇండియా యుద్దం అక్టోబర్ లేదా నవంబర్‌లో జరుగుతుందని అన్నాడు.ఈనేపథ్యంలోనే డిఫెన్స్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం ఇందుకు సంకేతాలు ఇచ్చాడు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు.

సరిహద్దు ప్రాంతాల్లో బంకర్లను నిర్మిస్తున్న పాకిస్థాన్
ఇక షేక్ రశీద్ అహ్మద్ ప్రధాని మోడిన రెండవ ప్రపంచ యుద్దం నాటి హిట్లర్,మరియు ముస్సోలితో యొక్క ఫాసిస్టు చర్యలకు చెందిన ప్రభుత్వ విధానాలు ప్రధాని మోడీ అవలంభిస్తున్నాడని ఆయన విమర్శించాడు.అయితే మరోవైపు భారత్‌తో చర్చలు కొనాసాగుతాయని పాకిస్థాన్ విదేశంగా మంత్రి సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలోనే రైల్వే మంత్రి మాత్రం ఎప్పుడు ఉద్రిక్త వాతవరణం సృష్టించే వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇక రైల్వే మంత్రి ప్రకటించినట్టుగా పాకిస్థాన్ దేశ సరిహద్దు ప్రాంతంలో బంకర్లను కూడ నిర్మిస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి.యుద్దం కోసం రెండు వైపుల ఉద్రిక్త వాతవరణ నెలకొనడంతో ఎప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఇరు దేశాల సరిహద్దుల్లో నెలకొంది.












Click it and Unblock the Notifications