'మంచి నీళ్లు మహా ప్రభో'.. భారత్ కు 4 లేఖలు రాసిన పాకిస్థాన్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన కఠినమైన చర్యలతో పాకిస్థాన్ అల్లకల్లోలం అవుతోంది. సింధూ నది జలాల పంపిణీ రద్దు, పాక్ పౌరులకు వీసాల జారీ రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత, ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు నిలిపివేత.. తదితర చర్యలతో పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇక ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదుల ఏరివేతతో పాటు పాకిస్థాన్ కు చెందిన వైమానిక స్థావరాలు, ఫైటర్ జెట్స్, డ్రోన్లు పూర్తిగా ధ్వంసం కావడంతో ఆ దేశానికి తీరని నష్టం మిగిల్చింది.
ఇక భారత్ తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయాల్లో సింధూ జలాల పంపిణీ నిలిపివేత ఒకటి. తాజాగా సింధూ జలాల ఒప్పందంపై భారత్ కు పాకిస్థాన్ 4 లేఖలు రాసింది. భారత్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేఖలో కోరింది పాక్. సింధూ జలాల నిలిపివేతతో పాకిస్థాన్ తీవ్ర సంక్షోభంలోకి జారుకుంటోందని పేర్కొంది. పాకిస్థాన్ కు నీళ్లు కట్ చేసి దాదాపు 2 నెలలు కావొస్తోంది. దీంతో ఆ దేశం తీవ్రంగా నీటి సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ మేరకు సింధూ నది జలాల పంపిణీ రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని పాక్ పట్టుబడుతోంది. ఇప్పటికే భారత ప్రభుత్వానికి 4 లేఖలు రాసింది.

అంతేకాక వరల్డ్ బ్యాంకును కూడా పాక్ ప్రభుత్వం అభ్యర్థించింది. భారత్ తో చర్చలు జరిపి నీటిని విడుదల చేసే మార్గాన్ని చూపాలని పేర్కొంది. కానీ వరల్డ్ బ్యాంక్ ఈ వివాదంలో తలదూర్చనని తెగేసి చెప్పినట్లు సమాచారం.
మరోవైపు ఇటీవల పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. " సింధూ జలాల పంపిణీని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న ఏకపక్షనిర్ణయం క్షమించరానిది. ఇది అనైతికం. అసాంఘీకం. రాజకీయాల లబ్ధికోసం లక్షల మంది ప్రాణాలు కోల్పోవాలా..? పాకిస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎప్పటికీ ఒప్పుకోదు" అని కీలక వ్యాఖ్యలు చేశారు.
بھارت کا سندھ طاس معاہدے کو یکطرفہ اور غیر قانونی طور پر معطل کرنا انتہائی افسوسناک ہے۔ لاکھوں انسانوں کی زندگیاں سیاسی مفادات کی نظر نہیں کی جا سکتیں، پاکستان اس اقدام کو کسی صورت قبول نہیں کرے گا۔
— Shehbaz Digital Media (@ShehbazDigital) May 30, 2025
~ وزیرِاعظم محمد شہباز شریف #PMShehbazInTajikistan 🇵🇰🇹🇯 pic.twitter.com/vyuuSDZDTu
సింధూ నదీజలాల ఒప్పందం 1960లో జరిగింది. భారత్- పాకిస్థాన్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ ఈ ఒప్పందంపై 1960 సెప్టెంబరు 19న సంతకాలు చేశాయి. అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ లు ఈ ఒప్పందాలపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు నదీ వ్యవస్థ నుండి 20 శాతం నీటిని భారత్ కు.. మిగిలిన 80శాతం నీటిని పాకిస్థాన్ కు ఇవ్వాలని ఈ ఒప్పందంలో ఉంది.












Click it and Unblock the Notifications