ఇంటికెళ్లేందుకు..: విమానాన్ని తోసిన ప్రయాణీకులు (ఫోటోలు)

న్యూఢిల్లీ: సైబీరియాలో ప్రయాణీకులు విమానం దిగి మరీ దానిని తోశారు. మైనస్ 52 డిగ్రీల ఉష్ణోగ్రతలో విమానం ముందుకు వెళ్లడం కష్టంగా మారింది. దీంతో ప్రయాణీకులు విమానం దిగి రన్ వే మీద మంచులో బిగుసుకుపోయిన విమానాన్ని బలంగా కొంచెం దూరం నెట్టుకు వచ్చారు.

దక్షిణాసియా దేశమైన సైబీరియాలోని ఇగార్కా నుంచి క్రాస్ నోయార్క్‌కు వెళ్తున్న విమానం మంచుతో గడ్డకట్టుకుపోయింది. దానిని లాగేందుకు ట్రక్కుల్ని వినియోగించాలనుకున్నారు. అవి కూడా గడ్డకట్టుకుపోయి స్టార్ట్ అయ్యేందుకు మొరాయించాయి. దీంతో ప్రయాణికులే ఓ చేయి వేశారు.

74 మంది ప్రయాణికులు తలోచేయి వేసి విమానాన్ని నెట్టారు. వారి శ్రమకు తోడు ఓ ట్రక్కు విమానాన్ని లాక్కెళ్లడంతో ఆ విమానం స్టార్ట్ అయ్యింది. సైబీరియాలోని ఇగార్కా విమానాశ్రయం ఆర్కిటిక్ వలయానికి సమీపంలో ఉంది. దీంతో ఇక్కడ నిరంతరం మంచు కురుస్తునే ఉంటుంది.

ఇక్కడ మైనస్ 52 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. దీంతో రన్ వే పైన బిగుసుకుపోయిన విమానాన్ని బలంగా కాస్త దూరం నెట్టుకుంటూ వెళ్లారు.

Passengers got out and pushed a Siberain plane

ఒకసారి గాలిలోకి ఎగిరాక విమానం ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా ప్రయాణించిందని ఓ ప్రయాణికుడు తీసిన వీడియోను యూట్యూబ్‌లో పెట్టాడు. అందరికీ ఇంటికి వెళ్లాలని ఉంటుంది కదా.. అందుకే సంతోషంగా ఈ పని చేశాం.. అంటూ సదరు వ్యక్తి అందులో పేర్కొన్నాడు. ఇంజిన్ స్టార్ట్ అయ్యాక, విమానం కండిషన్‌లోకి వచ్చాక ప్రయాణీకులు అందులోకి ఎక్కారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+