గ్లోబల్ వార్మింగ్: ఉప్పు చల్లితే సరి, కానీ...
న్యూయార్క్:కాలుష్యాన్ని నివారించేందుకుగాను ఆకాశంలో ఉప్పును వెదజల్లాలని శాస్త్రవేత్తలు నిర్ణయం తీసుకొన్నారు. భూమికి పన్నెండు నుండి పదమూడు కిలోమీటర్ల ఎత్తులో ఉప్పును వెదజల్లాలని నిర్ణయించారు. వాహనాలు, పరిశ్రమల నుండి వెలువడుతున్న కాలుష్యాన్ని పారదోలేందుకు శాస్త్రవేత్తలు ఈ నిర్ణయం తీసుకొన్నారు.
గ్లోబల్ వార్మింగ్ నుండి రక్షించడానికి శాస్త్రవేత్తలు ఈ నిర్ణయం తీసుకొన్నారు. క్లోరోప్లూరో కార్బన్ల మూలంగా ఓజోన్ పొరకు రంద్రాలు పడ్డాయి దీంతో అతినీలలోహిత కిరణాలు భూమి మీద పడుతున్నాయి ఈ సమయంలో భూమిని గ్లోబల్ వార్మింగ్ నుండి రక్షించేందుకు ఉప్పు చల్లితే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు.

ప్లానెటరీ సైన్స్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు సౌర కుటుంబంలోని గ్రహలు, గ్రహ శకలాలపై అధ్యయం చేశారు. ఉప్పు ఆవిరి అంశం వారి దృష్టికి వచ్చింది. ఆయా గ్రహలు, గ్రహశకలాలపై ఉన్న ఉప్పు ఏరోసాల్స్, సూర్యరశ్మిని ప్రభావవంతంగా పరావర్తనం చెందిస్తున్నాయని గుర్తించారు.
భూమిపైకి ప్రసరించే సూర్య కిరణాల ప్రభావం తగ్గేలా ఉప్పు ఏరోసాల్స్‌ను ట్రోపోస్పియర్ పొర పై భాగంలో చల్లాలనే కొత్త ప్రతిపాదన వచ్చింది. ఇదొక ఆసక్తికరమైన ఆలోచనగా తెలిపారు. ట్రోపోస్పియర్‌కు పైన ఉఫ్పు అణువులను వదలడం వల్ల సూర్యరశ్మిని పరావర్తనం చెందించి, భూమిని వేడెక్కకుండా కాపాడతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయంతో ఉన్నారు.
అయితే ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అసలు ఉప్పుతో ఓజోన్ పొరకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతాయని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఉప్పులోని రసాయనాలు వాతావరణంలోని మార్పులకు కూడ కారణమయ్యే అవకాశం ఉందని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
కాలుష్యాన్ని తగ్గించకపోతే ఓజోన్ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇదే జరిగితే వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయంతో ఉన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications