లీటర్ పెట్రోల్ కేవలం 3 రూపాయలకే.. మీకు కావాలా ??
ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో.. పెట్రోల్-డీజిల్ ధరలు సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు, సరఫరా అంతరాయాలు గ్లోబల్ ఇంధన మార్కెట్‌ను అస్థిరంగా మార్చాయి. దీని ప్రభావంగా అనేక దేశాల్లో ఇంధన ధరలు పెరిగి, జీవన వ్యయం గణనీయంగా పెరిగింది.
ముడి చమురు ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు మాత్రమే కాకుండా ఉత్పత్తి వ్యయాలు కూడా పెరుగుతున్నాయి. దీని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది. ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం కూడా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెట్రోల్ ? అత్యల్ప ధర ఉన్న పెట్రోల్ ఏ దేశాల్లో లభిస్తుందో తెలుసుకుందాం..

అత్యంత ఖరీదైన పెట్రోల్ ఉన్న దేశాలు..
ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెట్రోల్ ధరలు హాంగ్ కాంగ్లో నమోదవుతున్నాయి. లీటరు ధర $4.10 (సుమారు ₹340) ఉండగా.. 80% పెట్రోల్ దిగుమతులు, భారీ పన్నులు కారణంగా ఇంత ధర పలుకుతుంది.
మిగతా ఖరీదైన దేశాలు:
మలావి - $2.85
నెదర్లాండ్స్ - $2.73
డెన్మార్క్ - $2.66
సింగపూర్ - $2.54
జర్మనీ - $2.42
ఇంకా నార్వే, గ్రీస్ వంటి దేశాల్లో కూడా ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి.
అత్యంత చౌకైన పెట్రోల్ ఎక్కడ?
ప్రపంచంలో అత్యంత చౌకైన పెట్రోల్ ఇరాన్ లో లభిస్తోంది. అక్కడ లీటరు ధర కేవలం $0.029 (సుమారు రూ.2.69) మాత్రమే. దేశంలో విస్తారమైన చమురు నిల్వలు ఉండటం, ప్రభుత్వ సబ్సిడీలు అందించడం ఇందుకు కారణాలు. ఇరాన్ తర్వాత వెనిజులాలో కూడా పెట్రోల్ చాలా తక్కువ ధరకు లభిస్తోంది. అక్కడ కూడా సహజ వనరులు అధికంగా ఉండటం వల్ల ఇంధన ధరలు నియంత్రణలో ఉన్నాయి.
కాగా దేశాలను బట్టి పెట్రోల్ ధరల్లో ఈ భారీ వ్యత్యాసానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ముడి చమురు ఉత్పత్తి, దిగుమతులపై ఆధారపడటం.. పన్నులు, సబ్సిడీలు, కరెన్సీ మార్పిడి విలువలు వీటిని ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగితే, రాబోయే రోజుల్లో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయంపై మరింత భారంగా మారే అవకాశముంది.
మరోవైపు మన పొరుగు దేశం పాకిస్తాన్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అక్కడ డీజిల్ ధరలు 54.9 శాతం పెరిగి లీటరుకు రూ.520.35కు చేరగా.. పెట్రోల్ ధరలు 42.7 శాతం పెరిగి రూ.458.40కు పెరిగాయి.
-
ఇరాన్ భూస్థాపితం..?? ఆ దేశంపై ట్రంప్ అణు బాంబ్..!! -
బట్టబయలవుతున్న పాకిస్థాన్ కుట్ర బుద్ధి.. "కీలుబొమ్మ"గా మారిందా ?? -
జేడీ వాన్స్ అవుట్..? ట్రంప్ ఊహించని షాక్..?? -
ఇరాన్ పోరాటం భారత్ కు నేర్పుతున్న పాఠం..! టీఎంసీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..! -
అమెరికా-ఇరాన్ సీజ్ ఫైర్ మధ్యవర్తి పాక్ కాదా ? అసలు బ్రోకర్ ఎవరంటే ? -
రానున్న 12 గంటలు రైలులో ప్రయాణం చేయకండి: ప్రజలకు కీలక హెచ్చరికలు -
భారతీయులకు గండం! కేంద్రం రెడ్ అలర్ట్. రంగంలోకి ఎంబసీ. -
US Iran: గెలుపు ఎవరిది? అసలు ఇస్లామాబాద్‌లో ఏం జరగబోతోంది? -
"ఈ రాత్రితో ఇరాన్ నాగరికత సమాప్తం"-ఐరాస హెచ్చరికల్నీ లెక్కచేయని ట్రంప్..! -
ప్రపంచ చరిత్రలోనే ఈ రాత్రి కీలకం: ట్రంప్ సంచలనం -
అమెరికా అణు కమాండ్ సెంటర్ వద్ద ట్రంప్ 'డూమ్స్‌డే ప్లేన్' చక్కర్లు.. -
కోటీ 40 లక్షల మంది ఆత్మత్యాగానికి రెడీ-ట్రంప్ డెడ్ లైన్ వేళ ఇరాన్ అధ్యక్షుడి షాకింగ్..!












Click it and Unblock the Notifications