హిందువులా..? అయితే ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. పాకిస్థాన్ సంచలనం..!
గురునానక్ జయంతి సందర్భంగా పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని నాన్ ఖాన్ సాహిబ్ జిల్లాలో ఉన్న సిక్కుల పవిత్ర స్థలం నాన్ ఖాన్ సాహిబ్ కు భారత్ నుంచి సిక్కులను అనుమతిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. లాహోర్ నుంచి 80 కిలోమీటర్లు ఉన్న ఈ ప్రాంతంలో ఏటా గురునానక్ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది గురునానక్ 556 వ జన్మదిన వేడుకలను కూడా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
అయితే నాన్ ఖాన్ సాహిబ్ దర్శనం కోసం ఇటీవల 2,100 మంది భారతీయులను పాకిస్థాన్ లోకి అనుమతించేందుకు అక్కడి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు 2,100 మంది భారతీయుల వివరాలను భారత విదేశాంగ మంత్రి వెల్లడించారు. అయితే వీళ్లంతా సిక్కు మతస్థులేనని పాకిస్థాన్ భావించింది. అందులో కొందరు హిందువులు కూడా ఉన్నారు. మంగళవారం నాటికి 1900 మంది భక్తులు వాఘా సరిహద్దు దాటి పాకిస్థాన్ లోకి ప్రవేశించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతీయులు.. పాకిస్థాన్ లో ప్రవేశించడం ఇదే తొలిసారి. వాఘా బోర్డర్ వద్ద డాక్యుమెంట్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పాకిస్థాన్ అధికారులు.
అయితే వీరిలో 14 మంది భక్తులను మాత్రం పాకిస్థాన్ అధికారులు వెనక్కు పంపించారు. వారిని పాకిస్థాన్ లోకి అనుమతివ్వలేదు. వీళ్లంతా పాకిస్థాన్ లోని సింధి ప్రాంతంలో జన్మించినవారే.. కానీ భారత పౌరసత్వం తీసుకున్నారు. ఇప్పుడు తమ బంధువులను చూసేందుకు పాకిస్థాన్ కు వెళ్లారు. అయితే వాళ్లు హిందువులు అన్న కారణంగా వాళ్లను వెనక్కు పంపించినట్లు తెలుస్తోంది. మీరు హిందువులు.. సిక్కులతో కలిసి వెళ్లకూడదు.. అని అక్కడి అధికారులు వారితో అన్నట్లు స్పష్టమవుతోంది. రికార్డుల్లో సిక్కులు అని ఉన్నవారికే ప్రవేశం అని పాక్ అధికారులు తేల్చి చెప్పినట్లుసమాచారం. ఈ 14 మంది భారత్ లోని దిల్లీ, లక్నో ప్రాంతాలకు చెందినవారని తెలుస్తోంది. మరోవైపు 300 మంది వీసాలకోసం దరఖాస్తు చేసుకోగా భారత్ హోం మంత్రిత్వ శాఖ వారి దరఖాస్తులను కొట్టివేసింది.

ఇక 10 రోజుల యాత్రలో భాగంగా సిక్కులు.. నాన్ ఖాన్ సాహిబ్ దర్శనంతో పాటుగా హసన్ అబ్దాల్ లోని గురుద్వారా పంజా సాహిబ్, ఫరూఖాబాద్ లోని గురుద్వారా స్వచ్చ్ సౌదా, అలాగే కర్తార్ పుర్ లోని గురుద్వారా సాహిబ్ ను దర్శించుకోనున్నారు. జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాదుల మారణహోమంలో 22 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్థాన్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపి వాటిని ధ్వంసం చేసింది.












Click it and Unblock the Notifications