PM: ప్రధాన మంత్రి రాజీనామా, అధ్యక్షుడి జంప్ తో అలర్ట్, ఏం జరుగుతుందో అనే భయంతో, క్లైమాక్స్ !
కొలంబో/ శ్రీలంక: శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయి శ్రీలంకలో నిరసనలు వ్యక్తం కావడంతో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే దేశం వదిలిపారిపోయారు. ఇదే సందర్బంలో శ్రీలంక ప్రధాన మంత్రి రణిల్ విక్రమ్ సింఘే ఆయన పదవికి రాజీనామా చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఇంటి మీద దాడులు చేసిన నిరసనకారులు ప్రధాన మంత్రిని టార్గెట్ చేసుకుంటారని భయంతో రణిల్ విక్రమ్ సింఘే ఆయన పదవికి రాజీనామా చేశారని తెలిసింది.

సహనం కోల్పోయిన శ్రీలంక ప్రజలు
ఆర్థిక సంక్షోభం, నిత్యవసర వస్తువుల కోరత, పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటడం, ఆహార పదార్థాల కోరతతో శ్రీలంక ప్రజలు తిరగబడ్డారు. గత కొన్ని నెలల నుంచి శ్రీలంక ప్రజలు ఆందోళనకు దిగడంతో మహిందా రాజపక్స, చమల్ రాజపక్స, బాసిల్ రాజపక్స వారి పదవులకు రాజీనా చేశారు. రాజపక్స సోదరుల్లో ఒక్కడు అయిన గొటాబాయ్ రాజపక్స మాత్రం శ్రీలంక అధ్యక్షుడి పదవి నుంచి కిందకు దిగలేదు.

పోలీసుల కాల్పులతో పరిస్థితి చెయ్యిదాటిపోయింది
శ్రీలంక అధ్యక్షుడు గొటాబాయ్ రాజపక్స అధ్యక్ష భవనం చుట్టుముట్టిన ఆందోళనకారులను అడ్డుకోవడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. వేలాది మంది ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు కాల్పలు జరపడంతో కొందరు చనిపోయారు. సామాన్య ప్రజలు చనిపోవడంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు.

కింగ్ లా బతికిన రాజపక్సే చివరికి ?
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ్ రాజపక్స నివాసం ఉంటున్న భవనం చుట్టుముట్టారు. ఆందోళనకారులను నియత్రించడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేసి చివరికి చేతులు ఎత్తేశారు. చివరికి శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ్ రాజపక్స మిలటరి వాహనంలో అధ్యక్ష భవనం ఖాళీ చేసి మిలటరి షిప్ లో దేశం వదిలిపారిపోయారు.

తేరుకున్న ప్రధాన మంత్రి రాజీనామా
శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయి శ్రీలంకలో నిరసనలు వ్యక్తం కావడంతో ప్రధాన మంత్రి రణిల్ విక్రమ్ సింఘే ఆయన పదవికి రాజీనామా చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీ నాయకులు, స్పీకర్ సూచనలమేరకు తాను ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని రణిల్ విక్రమ్ సింఘే ట్విట్టర్ వేదికగా ప్రజలకు క్లారిటీ ఇచ్చారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఇంటి మీద దాడులు చేసిన నిరసనకారులు ప్రధాన మంత్రిని టార్గెట్ చేసుకుంటారని భయంతో రణిల్ విక్రమ్ సింఘే ఆయన పదవికి రాజీనామా చేశారని తెలిసింది.












Click it and Unblock the Notifications