ఆసక్తికరం: నీరవ్ మోడీ, ట్రంప్‌కు మధ్య సంబంధాలు?
న్యూఢిల్లీ: ఇండియాలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు సహ రూ.17 వేల కోట్లకు పైగా బురిడీ కొట్టించిన వ్యాపారి నీరవ్ మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సంబంధాలున్నాయని మీడియాలో ప్రచారం సాగుతోంది.
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఇండియాను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన కోసం ఇంటర్‌పోల్ నోటీసులు జారీ చేసింది. నీరవ్ మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మధ్య ఉన్న సంబంధం గురించిన ఆసక్తికర కథనాలు మీడియాలో వస్తున్నాయి.

నీరవ్ భార్య అమీ మోదీకి అమెరికా పాస్ పోర్టు ఉంది. ట్రంప్ తో పాటు అమీ, నీరవ్ అంతా అమెరికాలోని ఒకే స్కూల్ లో విద్యను అభ్యసించారు. వీరు ముగ్గురూ ఫిలడెల్ఫియాలోని 'ద వార్టన్ బిజినెస్ స్కూల్'లోనే చదివారు. అమీ, నీరవ్ తొలిసారిగా కలుసుకున్నది కూడా ఇక్కడేనని మీడియా కథనాలు చెబుతున్నాయి.
అయితే, నీరవ్ ఫస్ట్ ఇయర్ తరువాత చదువు మానేశాడు. ఇదిలావుండగా, రెండున్నరేళ్ల క్రితం తన వ్యాపార విస్తరణలో భాగంగా, న్యూయార్క్ లో నీరవ్ మోదీ ఓ కొత్త ఆభరణాల దుకాణాన్ని ఏర్పాటు చేస్తే అప్పట్లో స్టోర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ట్రంప్ కూడా వచ్చారని అంటున్నారు.

ఇప్పుడు అమెరికాలో తలదాచుకున్న నీరవ్ ను ఇండియాకు రప్పించే యత్నాలను అధికారులు మొదలుపెట్టగా, వాటికి ట్రంప్ సర్కారు ఏ మేరకు మద్దతిస్తుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications