భారీ భూకంపం: పాకిస్తాన్, అఫ్గాన్‌ల్లో 180 మృతి
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంతో పాటు పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్‌లో ఈరోజు భారీ భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్థాన్‌లో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని సైఫాబాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందుకుష్ పర్వత ప్రాంతంలో 190 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
కాగా, పాకిస్థాన్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.1గా నమోదైంది. సుమారు ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్‌లో సంభవించిన ఈ భూకంప తీవ్రతకు పలు చోట్ల ఇళ్లు కూలాయి. భూకంప తీవ్రతకు పాకిస్తాన్, పక్కనే ఉన్న అఫ్గానిస్తాన్‌ల్లో 180 మంది మృత్యువాత పడ్డారు. పాకిస్తాన్‌లో 147 మంది మరణించగా, అఫ్గానిస్తాన్‌లో 33 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా పెషావర్‌లో ప్రాణ, ఆస్తినష్టం ఎక్కువగా సంభవించింది. వెంటనే భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆర్మీకి పాకిస్థాన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆప్ఘనిస్థాన్‌లో ఐదుగురు చనిపోగా, 55 మందికి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు.
ఆఫ్ఘన్‌లో 4.8 తీవ్రతతో మరో భూకంపం
ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి భూమి కంపించింది. ఈ సారి రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రతా 4.8గా నమోదైంది.
Five dead, 55 injured in #Afghanistan #earthquake, says head of #Nangahar hospital. 17 dead in #Pakistan. 7.5 magnitude quake in Afghanistan
— Mehreen Zahra-Malik (@mehreenzahra) October 26, 2015 భూకంప ప్రకటనపై భారత ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో తక్షణ చర్యలకు ప్రధాని మోడీ ఆదేశించారు. భూకంప ప్రాంతాల్లో నష్టం జరగొద్దని ప్రార్ధిస్తున్నానంటూ భారత ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా తన సందేశాన్నిచ్చారు. పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్‌లకు సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందంటూ ట్వీట్ చేశారు.
కాగా పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్‌లో సంభవించిన భూకంప తీవ్రత భారత్‌పై కూడా ప్రభావం చూపింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర వ్యాప్తంగా సమాచార వ్యవస్థ పూర్తిగా స్ధంభించింది. ఈ భూకంపంతో కాశ్మీర్‌లో టెలిఫోన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
USGS map showing 7.7 earthquake in northern Afghanistan, Badakhshan province. Tremors felt in Pakistan, India as well.
— Josh Smith (@joshjonsmith) October 26, 2015 గతేదాడి ఏప్రిల్ 25న నేపాల్ లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి నేపాల్ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. తాజాగా 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ఎంత నష్టం కలిగించిందో అని అంతా ఆందోళన చెందుతున్నారు.
An earthquake rattles lights in our office in Noida. Tremors lasted over 2 minutes. Wonder how it's at the epicentre pic.twitter.com/iXOaIDU5iy
— Rajesh Kalra (@rajeshkalra) October 26, 2015 From a distance, #Kabul doesn't appear to have suffered any major damage following major #earthquake this PM. pic.twitter.com/AXjK76qE0o
— Andrew Quilty (@andrewquilty) October 26, 2015 From a distance, #Kabul doesn't appear to have suffered any major damage following major #earthquake this PM. pic.twitter.com/AXjK76qE0o
— Andrew Quilty (@andrewquilty) October 26, 2015 Strong tremors felt in Ludhiana, earthquake was 7.7 on Richter Scale with epicentre in Hindukush, Afghanistan pic.twitter.com/PItp3TM9kK
— ANI (@ANI_news) October 26, 2015 











Click it and Unblock the Notifications