చందమామపై మైనింగ్: తవ్వకాల కోసం ప్రయివేటు కంపెనీల ఉవ్విళ్లు

వాషింగ్టన్: చందమామ పైన తవ్వకాల కోసం పలు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి! బూడిద వర్ణపు ఉపరితలంతో నిర్జీవంగా కనిపించే చంద్రుడిని డబ్బు సంపాదించి పెట్టే యంత్రంగా మార్చాలని పలు కంపెనీలు ఉవ్వీళ్లూరుతున్నాయి. ఈ సహజసిద్ధ ఉపగ్రహం పైన మైనింగ్‌కు అపార అవకాశాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు తేల్చారు.

దీంతో అక్కడ మైనింగ్ కోసం పలు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. చందమామ పైన ధ్రువ ప్రాంతాల్లో 160 కోట్ల టన్నుల నీరు.. మంచు రూపంలో ఉంది. చందమామ ఉపరితలం కింద భారీగా అరుదైన మూలకాలు ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు.

దాదాపు నలభై ఏళ్ల కిందడ అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) చంద్రుడి పైకి మానవసహిత యాత్రలను నిలిపివేసింది. ఆ తర్వాత మానవరహిత యాత్రలను చేపట్టింది. వీటి ద్వారా చంద్రుడి ఉత్తర, దక్షిణ ధ్రవాల వద్ద భారీగా మంచు రూపంలో నీరు ఉన్నట్లుగా గుర్తించారు.

 Private firms exploring moon mining

అమెరికాలోని టెక్సాస్ కేంద్రంగా పని చేస్తున్న షాకిల్టన్ ఎనర్జీ కంపెనీ నీటి రూపంలో ఉన్న మంచును రాకెట్ ఇంధనంగా మార్చాలని భావిస్తోంది. ఇందుకోసం నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొడుతుంది. ఈ ఇంధనాన్ని దిగువ భూకక్ష్యలో అంతరిక్ష భాగస్వాములకు విక్రయించాలని యోచిస్తోంది. మైనింగ్ కోసం మానవులు, రోబోలను పంపాలని సదరు కంపెనీ చూస్తోంది.

మరో ప్రయివేటు ఫండింగ్ కంపెనీ మూన్ ఎక్స్‌ప్రెస్ కూడా చంద్రుడి పైన ఉన్న నీటిని ఫ్యూయల్‌గా ఉపయోగించేందుకు తవ్వకాలు జరపాలని భావిస్తోంది. అయితే వారు మరో భిన్న ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. చంద్రుడి పైన ఉన్న వనరులను హై టెస్ట్ పెరాక్సైడ్ (హెచ్‌టీపీ)గా తయారు చేయాలని చూస్తోంది. దీనిని స్పేస్ క్రాఫ్ట్‌‌లలో ఇంధనంగా వాడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+