వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచ అతిపెద్ద టెలీస్కోపుల్లో ఒకటి... కుప్పకూలిన ప్యూర్టో రికో అరెసిబో అబ్జర్వేటరీ..

|
Google Oneindia TeluguNews

ప్రపంచంలోనే అతిపెద్దదైన రేడియో టెలీస్కోపుల్లో ఒకటైన ప్యూర్టో రికో అరెసిబో అబ్జర్వేటరీ మంగళవారం(డిసెంబర్ 1) ఒక్కసారిగా కుప్పకూలింది. గత 57ఏళ్లుగా ఎన్నో ఖగోళ పరిశోధనలకు,ఆవిష్కరణలకు అరెసిబో అబ్జర్వేటరీ దోహదపడింది. ఈ ఏడాది అగస్టు నుంచి అది తీవ్రంగా డ్యామేజ్ అవుతూ వచ్చిందని అధికారులు తెలిపారు.

ఈ రేడియో టెలీస్కోప్‌ను ఏర్పాటు చేసిన 900 టన్నుల ఇన్‌స్ట్రుమెంట్ ప్లాట్‌ఫాం క్రమంగా దెబ్బతింటూ వచ్చిందని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వెల్లడించింది. వెయ్యి మీటర్ల ఉపరితలం కలిగిన టెలీస్కోప్ డిష్‌కు సపోర్టింగ్‌గా ఉన్న రెండు కేబుల్స్ అగస్టు నుంచి దెబ్బతింటూ వచ్చాయని పేర్కొంది.దీంతో మంగళవారం రాత్రికి రాత్రే అరెసిబో అబ్జర్వేటరీ టెలీస్కోప్ కుప్పకూలిందని తెలిపింది.ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలవలేదని తెలిపింది. జరిగిన ఘటన తమకు బాధ కలిగిస్తోందని.. అయినప్పటికీ ప్యూర్టో రికోతో కలిసి శాస్త్రీయ ఆవిష్కరణలకు కృషి చేస్తామని పేర్కొంది.

Puerto Ricos Arecibo Observatory Telescope Collapses

నిజానికి దీనికి మరమ్మత్తులు నిర్వహించాలని ఎన్ఎస్ఎఫ్,యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా అధికారులు భావించినప్పటికీ... అది చాలా ప్రమాదకరమని తేల్చారు.టెలిస్కోప్‌కి ఉన్న మూడు సపోర్టింగ్ టవర్లలో పైభాగం విరిగిపోయిందని, ఇన్‌స్ట్రుమెంట్ ప్లాట్‌ఫాం పడిపోవడంతో టెలిస్కోప్ సపోర్ట్ కేబుల్స్ కూడా దెబ్బతిన్నాయని ప్రాథమిక పరిశోధనల్లో తేలింది. అరెసిబో సిబ్బంది మరో కొత్త ప్రణాళికతో ముుందుకు వచ్చేందుకు,ఖగోళ పరిశోధనలు కొనసాగించేందుకు కావాల్సిన ఆర్థిక సహాయం అందుతూనే ఉంటుందని ఎన్ఎస్ఎఫ్ స్పష్టం చేసింది.

Recommended Video

Indian-American Mala Adiga Appointed As Jill Biden's Policy Director

అంతరిక్షం నుంచి రేడియో తరంగాలను గ్రహించే ఈ టెలీస్కోప్ గ్రహాంతర జీవుల ఉనికికి సంబంధించిన అధ్యయనానికి ఎంతగానో దోహదపడింది. అలాగే ఖగోళంలో ప్రమాదకర గ్రహశకలాలను గుర్తించడంలోనూ దోహదపడింది. 1995లో వచ్చిన జేమ్స్ బాండ్ సిరీస్‌లలో ఒకటైన 'గోల్డెన్ ఐ' చిత్రంలోని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించడంతో ప్రపంచవ్యాప్తంగా దీనికి మరింత గుర్తింపు లభించింది.

English summary
A massive radio telescope at Puerto Rico's Arecibo Observatory, one of the world's largest, collapsed on Tuesday after sustaining severe damage since August, officials said, following 57 years of astronomical discoveries
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X