Afghanistan: కాబూల్‌ చేరిన ఖతర్ టీమ్-తాలిబన్లకు వాళ్లే దిక్కు-ఎలాగైనా అందుకు ఒప్పించే ప్రయత్నం..!

కాబూల్ విమానాశ్రయంలో విమాన రాకపోకలు పునరుద్దరించబడనున్నాయా... ఆ దిశగా తాలిబన్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారా... ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే ఇందుకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. అమెరికా,నాటో దళాల నిష్క్రమణతో కాబూల్ విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాలిబన్ల ఆధీనంలో ఉన్న విమానాశ్రయంలోకి విమాన సర్వీసులు నడిపేందుకు ఏ దేశం సాహసించట్లేదు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలైన టర్కీ,ఖతర్‌లే తాలిబన్లకు దిక్కుగా మారాయి. కాబూల్‌కు విమాన సర్వీసులు నడపాలని కోరుతూ తాలిబన్లు ఆ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందుకోసం వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఖతర్‌ నుంచి ఏవియేషన్ నిపుణుల బృందం కాబూల్‌కి చేరింది.

ఖతర్ టీమ్ ఏం చేయబోతున్నది...

ఖతర్ టీమ్ ఏం చేయబోతున్నది...

ఖతర్ నుంచి కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయానికి బుధవారం(సెప్టెంబర్ 2) ఏవియేషన్ నిపుణుల బృందం చేరింది. విమానాశ్రయాన్ని పునరుద్దరించే విషయమై తాలిబన్ ప్రభుత్వంతో వీరు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.'విమాన సర్వీసుల పునరుద్దరణకు సంబంధించి ఖతర్ ఏవియేషన్ టీమ్ నుంచి సాంకేతిక సాయం పొందేందుకు ఇప్పటికైతే ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ప్రస్తుతం ఇది చర్చల దశలోనే ఉంది. భద్రత,విమాన సర్వీసుల ఆపరేషన్‌పై వారు చర్చలు జరుపుతున్నారు.' అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎలాగైనా ఖతర్‌,టర్కీలను విమాన సర్వీసులు నడిపించేందుకు ఒప్పించేందుకు తాలిబన్ సర్కార్ ప్రయత్నిస్తోంది.

సీనియర్ తాలిబన్ నేత ఏమన్నారంటే...

సీనియర్ తాలిబన్ నేత ఏమన్నారంటే...


సీనియర్ తాలిబన్ నేత అనాస్ హక్కనీ మాట్లాడుతూ... తమ పౌరుల తరలింపు ప్రక్రియ సందర్భంగా పశ్చిమ దేశాలు కాబూల్ విమానాశ్రయాన్ని డ్యామేజ్ చేశాయని ఆరోపించారు. విమానాశ్రయాన్ని తిరిగి యథాస్థితికి తీసుకొచ్చేందుకు ఖతర్ ఏవియేషన్ టీమ్ కాబూల్‌కు వచ్చిందన్నారు. త్వరలోనే కాబూల్ విమానాశ్రయం నుంచి రాకపోకలు పున:ప్రారంభమవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ విమానాశ్రయం తిరిగి పునరుద్దరించబడినా పశ్చిమాసియా దేశాలు తప్ప మిగతా దేశాలేవీ ఇప్పట్లో విమాన సర్వీసులు నడిపే సూచనలు కనిపించట్లేదు.

ఆ పరిస్థితి కనిపించట్లేదు...

ఆ పరిస్థితి కనిపించట్లేదు...

ఆగస్టు 31తో డెడ్ లైన్ ముగియడంతో... అంతకు ఒకరోజు ముందే అమెరికా,నాటో దళాలు కాబూల్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అమెరికా సైన్యం కాబూల్‌ను వీడటంతో విమానాశ్రయం తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లింది. ఆరోజు తాలిబన్లు సంబరాలు జరుపుకున్నారు. తమకు పూర్తి స్వాతంత్య్రం వచ్చిందని... ఇది తాము సాధించిన విజయమని ప్రకటించుకున్నారు. అన్ని దేశాలతోనూ దౌత్య సంబంధాలు కోరుకుంటున్నామని... ఎవరితోనూ శత్రుత్వానికి తావు లేదని ప్రకటించారు.అయితే తాలిబన్ల ప్రకటనను ఏ దేశం విశ్వసించే పరిస్థితి లేదు.

ఆ మద్దతు ఎంతకాలం....

ఆ మద్దతు ఎంతకాలం....


అమెరికా సైన్యం ఉన్నంత సేపు దాదాపు 20 దేశాలు కాబూల్ విమానాశ్రయం నుంచి తమ పౌరుల తరలింపు ప్రక్రియను చేపట్టాయి. అమెరికా నిష్క్రమణతో ఇక ఏ దేశం అక్కడ అడుగుపెట్టే సాహసం చేయట్లేదు.ఇప్పటికీ పలువురు అమెరికన్లు,ఇతర దేశస్తులు అక్కడ చిక్కుకుపోయి ఉన్నప్పటికీ... వారిని తీసుకొచ్చే చర్యలేవీ కనిపించట్లేదు. తమ నిష్క్రమణ తర్వాత కూడా తాలిబన్లు సురక్షిత రాకపోకలకు అనుమతిస్తారని అమెరికా విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే ఇతర దేశాలు మాత్రం తాలిబన్లను నమ్మే పరిస్థితి కనిపించట్లేదు.అమెరికా సేనలు అక్కడ ఉన్నన్ని రోజులు తాలిబన్లు విమానాశ్రయం వెలుపలికే పరిమితమయ్యారు. ప్రస్తుతం విమానాశ్రయం వారి ఆధీనంలోనే ఉండటంతో అక్కడ అడుగుపెట్టేందుకు అన్ని దేశాలు జంకుతున్నాయి. మరోవైపు తాలిబన్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇస్లామిక్ చట్టాలను అమలుచేస్తూ మానవ హక్కులను కాలరాసే ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించడం జరగదనే చెప్పాలి. అయితే ఇరాన్,రష్యా,చైనా,పాకిస్తాన్ వంటి దేశాలు తాలిబన్ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నాయి. వీరి మద్దతు ఎన్నాళ్లు ఉంటుందనేది వేచి చూడాలి.

పోరాడుతున్న పంజ్‌షీర్

పోరాడుతున్న పంజ్‌షీర్


ఇప్పటివరకూ తమ వశం కాని పంజ్‌షీర్ ప్రావిన్స్‌ను ఆక్రమించేందుకు తాలిబన్లు తమ శక్తియుక్తులన్నీ ప్రయోగిస్తున్నారు. అయితే పంజ్‌షీర్ తిరుగుబాటు దళం తాలిబన్లకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా పంజ్‌షీర్ యోధులు జరిపిన దాడిలో 13 మంది తాలిబన్లు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి.అయితే పంజ్‌షీర్ దళంలోనూ కొంతమంది చనిపోయినప్పటికీ ఆ వివరాలేవీ బయటకు రాలేదు. ఇరువైపులా మరణాలు సంభవించాయని టోలో న్యూస్ వెల్లడించింది. ఇప్పటివరకూ 350 మంది తాలిబన్లను పంజ్‌షీర్ దళం మట్టుబెట్టినట్లు తెలుస్తోంది.

తాడో పేడో తేల్చుకునేందుకు...

తాడో పేడో తేల్చుకునేందుకు...

వారం రోజుల క్రితమే పదుల సంఖ్యలో వాహనాల్లో పంజ్‌షీర్ వైపు కదిలిన తాలిబన్ ఫైటర్లు... సోమవారం(ఆగస్టు 30) అక్కడ అడుగుపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ పంజ్‌షీర్ యోధులు ఆదిలోనే తాలిబన్లను చావుదెబ్బ కొట్టారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య అక్కడ భీకర పోరు నడుస్తోంది. ఈ యుద్ధం ఎన్నిరోజులు.. ఎప్పుడు ముగుస్తుందనేది అంచనా వేయడం కష్టంగా మారింది. అంతర్జాతీయ సమాజపు మద్దతు కరువవడంతో ఒకానొక దశలో పంజ్‌షీర్‌లో మసౌద్ నాయకత్వం తాలిబన్లకు లొంగిపోతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు అతను సిద్దపడుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ పంజ్‌షీర్ తాలిబన్లకు లొంగిపోలేదు. తాలిబన్లతో తాడో పేడో తేల్చుకునేందుకు వారితో పోరాడుతోంది.సాయుధ పంథాలోనే వారిపై తిరుగుబాటు జరుపుతోంది. అయితే సుదీర్ఘ కాలం పోరాటం కొనసాగితే పంజ్‌షీర్ ఎంతవరకు తాలిబన్లను ఎదుర్కోగలదనేది వేచి చూడాలి.

ఆఫ్గన్ అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోవడంతో ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ తనను తాను ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పంజ్‌షీర్‌లోనే మకాం వేసి తాలిబన్లపై తిరుగుబాటుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ వ్యూహాల ఫలితంగానే ఇటీవల బాగ్లన్ ప్రావిన్స్‌లోని మూడు జిల్లాలను ప్రజా తిరుగుబాటుతో తాలిబన్ల నుంచి విముక్తి చేయగలిగారు. కానీ తాలిబన్లు తిరిగి వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకోగలిగారు. పంజ్‌షీర్ తిరుగుబాటు విజయవంతమైతే అది దేశమంతా పాకే అవకాశం ఉంది. అందుకే పంజ్‌షీర్ పోరాటాన్ని ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+