లైవ్ ప్రోగ్రామ్ లో రేడియో జాకీ దారుణ హత్య
బ్రెజిల్: రేడియో జాకీని అతి దారుణంగా హత్య చేసిన సంఘటన బ్రెజిల్ లో జరిగింది. లైవ్ కార్యక్రమం నిర్వహిస్తుండగానే రేడియో స్టేషన్ లో చోరబడిన దుండగులు రేడియో జాకీని అతి కిరాతకంగా కాల్చి చంపారు. ఇద్దరు ముసుగులు ధరించిన వ్యక్తులు రేడియో జాకీని హత్య చేశారని పోలీసు అధికారులు తెలిపారు.
బ్రెజిల్ పోలీసు అధికారుల కథనం మేరకు జోవా వెల్డసిర్ డీ బోర్బా (52) బ్రెజిల్ రేడియో డిప్యు సొరా ఏఎమ్ లో వ్యాఖ్యాత (రేడియో జాకీ)గా పని చేస్తున్నాడు. గత 10 సంవత్సరాల నుంచి ఆయన నేర సంఘటనలు (క్రైం) రిపోర్టు చేసే కార్యక్రమంలో పని చేసేవారు. ఇటీవల బోర్బా సంగీత కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.

ఈ క్రమంలో రేడియో కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు ముసుగులు వేసుకుని రేడియో కార్యాలయంలోకి వెళ్లారు. రేడియో కార్యక్రమంలో ఉన్న బోర్బాను అతి దారుణంగా రివాల్వర్లతో కాల్చి పరారైనారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
చికిత్స విఫలమై బోర్బా మరణించాడని పోలీసులు అన్నారు. ఈ విషయంలో బోర్బా స్నేహితుడు మీడియాతో మాట్లాడుతూ తాను సిగరేట్ తాగడానికి బయటకు వెళ్లి వచ్చే లోపు ఈ దారుణం జరిగిందని విచారం వ్యక్తం చేస్తున్నాడు. బోర్బా క్రైం రిపోర్టులు చేసే సమయంలో అనేక బెదిరింపులు వచ్చాయని, అందుకే ఆయన హత్యకు గురైయ్యాడని పోలీసు అధికారులు తెలిపారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications