పాకిస్తాన్ ఘాతుకంపై రషీద్ ఖాన్ షాక్
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఓ ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 250 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడిని ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ ధృవీకరించారు. వందలమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో పాకిస్తాన్ చేసిన ఈ దాడులకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్థానిక టీవీ ఛానెల్‌లు కూడా ఈ ఫుటేజీని ప్రసారం చేశాయి. హాస్పిటల్, డ్రగ్స్ రిహాబిలిటేషన్ పై దాడి జరిగినట్లు ఆఫ్ఘనిస్తాన్ మీడియా వెల్లడించింది. దాడి సంభవించిన వెంటనే భవనం మొత్తం మంటల్లో చిక్కుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయడం, శిథిలాల నుండి బాధితులను రెస్క్యూ సిబ్బంది తరలించడం ఈ వీడియోల్లో రికార్డయింది.

స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిందని ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి హమ్దుల్లా ఫిట్రాత్ చెప్పారు. 2,000 పడకల ఆసుపత్రి తీవ్రంగా దెబ్బతిందని అన్నారు. ఈ ఘటనలో 400 మంది మరణించగా, దాదాపు 250 మందికి పైగా రోగులు గాయపడినట్లు చెప్పారు.
ఈ ఘటనపై అఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాబూల్‌పై పాకిస్తాన్ వైమానిక దాడుల్లో పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ పై దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. జనావాసాలు, విద్యా సంస్థలు లేదా వైద్య మౌలిక వసతులను ఉద్దేశపూరకంగా గాని, పొరపాటున గాని లక్ష్యంగా చేసుకోవడాన్ని తప్పుపట్టారు. దీన్ని వార్ క్రైమ్ గా అభివర్ణించారు. పవిత్ర రంజాన్ మాసంలో మనుషుల ప్రాణాల పట్ల ఈ నిర్లక్ష్యం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
I am deeply saddened by the latest reports of civilian casualties as a result of Pakistani airstrikes in Kabul. Targeting civilian homes, educational facilities or medical infrastructure, either intentional or by mistake, is a war crime. The sheer disregard for human lives,… pic.twitter.com/DbFRRh2qAJ
— Rashid Khan (@rashidkhan_19) March 16, 2026
ఇటువంటి ఘటనలు తీవ్ర ఆందోళనకరమని, ద్వేషాన్ని మాత్రమే పెంచుతాయని అన్నారు. ఈ దారుణాన్ని ఐక్యరాజ్యసమితి సహా ఇతర మానవ హక్కుల సంస్థలు క్షుణ్ణంగా విచారించాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని రషీద్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. ఈ కష్టకాలంలో తన తోటి ప్రజలకు అండగా నిల్చుంటానని, ఈ పరిస్థితుల నుంచి కోలుకుంటూ, ఓ సుసంపన్న దేశంగా ఎదుగుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications